కృష్ణ

దాళ్వాపై నోరువిప్పరేం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఎన్నో అంశాలకు వేదికగా మారిన అసెంబ్లీ సమావేశాల్లో దాళ్వాపై మాత్రం జిల్లాకు చెందిన పాలకులు నోరు విప్పడం లేదు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లుగా దాళ్వా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగం ఈ విడత దాళ్వాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు తాము అధికారంలోకి వస్తే దాళ్వా ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాళ్వాపై నోరు విప్పకపోవడం సర్వత్రా విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవలి కాలంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), పక్క నియోజకవర్గమైన పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు జోగి రమేష్‌లు దాళ్వాపై రైతులకు భరోసా ఇస్తూ ప్రకటనలు చేశారు. దాళ్వా ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అధికారికంగా మాత్రం ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనై దాళ్వాకు సాగునీటి విడుదల విషయాన్ని ప్రస్తావించి తీపి కబురు చెబుతారని రైతులంతా ఆశిస్తున్నారు. కానీ అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే దాళ్వా గురించి ప్రస్థావన చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెల్టా శివారు ప్రాంతాలైన మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, కైకలూరు నియోజకవర్గాలకు దాళ్వా తప్పనిసరిగా మారింది. ఈ ప్రాంతాల్లో అపరాల సాగు అంత ఆశాజనకంగా ఉండటం లేదు. ఫలితంగా దాళ్వాపైనే ఆయా నియోజకవర్గ రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం మాత్రం దాళ్వా విషయంలో సాచివేత ధోరణి అవలంబిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 50 శాతానికి చేరువలో వరి కోతలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దాళ్వాపై స్పష్టత ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోవల్సి వస్తుందని రైతాంగం పేర్కొంటోంది. దాళ్వా ఉందో లేదో చెబితే ప్రత్యామ్నాయం చూసుకుంటామని, అలా కాదని కాలయాపన చేస్తే మూల్యం ఎవరు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు.

విశ్వకర్మలంటే సరస్వతీ పుత్రులే గానీ లక్ష్మీపుత్రులు కాదు
* తెలంగాణ శాసనసభ మాజీ సభాపతి మధుసూదనాచారి
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 12: విశ్వకర్మలంటే సరస్వతీ పుత్రులే గానీ లక్ష్మీపుత్రులు కాదని తెలంగాణ శాసనసభ మాజీ సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. స్థానిక పవిత్ర కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ విరాట్ విశ్వకర్మ భవన్‌ను గురువారం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ దేవుని రూపాన్ని ప్రతిసృష్టించే శక్తి విశ్వకర్మలకే ఉందన్నారు. అటువంటి విశ్వకర్మలో పుట్టిన వారంతా సరస్వతీ పుత్రులే గాని లక్ష్మీపుత్రులు కాదన్నారు. విశ్వకర్మల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లాలుకోట వెంకటాచారి, గుంటముక్కల రామబ్రహ్మం, పేరం బాకా దేవేంద్ర కుమార్, గొల్లపూడి పూర్ణచంద్ర శేఖరరావు, కాకుమాను కృష్ణారావు, మానేపల్లి బ్రహ్మాజీ, శివకోటి రాజేంద్ర ప్రసాద్, ఓలేటి రమణ తదితరులు పాల్గొన్నారు.