కృష్ణ

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు విశ్రాంత సైనిక ఉద్యోగుల సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఇసుక అక్రమ రవాణాను నిలువరించేందుకు గాను జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల వద్ద విశ్రాంత సైనిక ఉద్యోగుల సేవలకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విశ్రాంత సైనిక ఉద్యోగులు చెక్ పోస్టుల్లో విధులు నిర్వర్తించేందుకు ముందుకు రావాలని కోరారు. నెలసరి వేతనం రూ.15వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు గాను పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలైన జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, వీరులపాడు, కంచికచర్ల, జి.కొండూరు, మైలవరం, ఎ.కొండూరు, గంపలగూడెం, తిరువూరు, చాట్రాయి, విస్సన్నపేట మండలాల్లో చెక్ పోస్టుల ఏర్పాటు జరిగిందన్నారు. ఈ చెక్‌పోస్టుల్లో విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి గల విశ్రాంత సైనిక ఉద్యోగులు సమీపంలోని పోలీసు స్టేషన్‌లలో గానీ జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో వివరాలు అందజేయాలని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కోరారు.

చిరువానతో రైతుల గుండెల్లో గుబులు
గుడ్లవల్లేరు, డిసెంబర్ 14: మండలంలోని దాదాపు 25వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. పంట పనల మీద ఉన్న సమయంలో నాలుగు రోజులుగా చిరువాన అడపాదడపా పడుతుండటంతో కట్టివేత పనులను రైతులు ముమ్మరం చేశారు. వ్యవసాయ కూలీలకు పనులు సాగటంతో కూలీ ఎకరాకు రూ.4వేలు నుండి రూ.6వేలు వసూలు చేస్తున్నారు. అంత కూలీ రైతులు ఇస్తానన్నా కూలీలు దొరకడం లేదు. అలాగే బంటుమిల్లి కోర్టులో నిర్వహించిన లోక్ ఆదాలత్‌లో ఎక్సైజ్‌కు సంబంధించి 19 కేసులను పరిష్కరించారు.