కృష్ణ

సామరస్య పరిష్కారమే ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అన్నింటికన్నా సామరస్య పరిష్కారమే ఉత్తమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లా ప్రధాన న్యాయస్థానం ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు, పలు న్యాయస్థానాలకు చెందిన న్యాయమూర్తులతో కలిసి జిల్లా జడ్జి లోక్ ఆదాలత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ న్యాయస్థానాల్లో కేసుల సత్వర పరిష్కారానికి లోక్ ఆదాలత్‌లు నిర్వహిస్తున్నామన్నారు. ఇరుపక్షాలకు అంగీకారంతో వేలాది పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. లోక్ ఆదాలత్‌ల నిర్వహణలో జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో కూడా లోక్ ఆదాలత్‌ల ద్వారా అత్యధిక కేసుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. లోక్ ఆదాలత్ తీర్పు సుప్రీం కోర్టు తీర్పుతో సమానమన్నారు. ఒక సారి లోక్ ఆదాలత్‌లో పరిష్కారమైన కేసును మళ్లీ విచారించే అవకాశం లేదన్నారు. అదే అంతిమ తీర్పు అన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ లోక్ ఆదాలత్‌ల ద్వారా ఇరువర్గాలకు చక్కటి పరిష్కారం లభిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా లోక్ ఆదాలత్‌లో పోలీసు స్టేషన్ స్థాయిలో విచారణలో ఉన్న 397 కేసులు, న్యాయస్థానాల్లో వాయిదాలు నడుస్తున్న 1062 మొత్తం 1459 కేసులను గుర్తించినట్టు తెలిపారు. ఇరువర్గాలు సామరస్య ధోరణితో సమస్య పట్ల అవగాహనతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మెలిగే సందర్భాలలో సమస్యలు కేసులుగా రూపాంతరం చెందవని, ఇరువర్గాలు సంయమనంతో వ్యవహరించి సమస్య పరిష్కరించుకునే మధ్యే మార్గం అవలంభించినట్లైతే సమస్య జఠిలం కాకుండా కార్పణ్యాలకు తావు లేకుండా ఉంటుందన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని పలు న్యాయస్థానాల్లో జరిగిన లోక్ ఆదాలత్‌ల ద్వారా కేసులను పరిష్కరించుకున్న వారికి రాజీ పత్రాలను జిల్లా జడ్జి భీమారావు, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజారావు, పలు న్యాయస్థానాల న్యాయమూర్తులు ఇబ్రహీం, వెంకటేశ్వరరెడ్డి, సీతారామ కృష్ణారావు, అన్నపూర్ణ, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వడ్డి జితేంద్ర, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.