కృష్ణ

రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలకు ఎస్‌వీఎల్ విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: రాష్టస్థ్రాయి సీనియర్ బేస్‌బాల్ పోటీలకు అవనిగడ్డ ఎస్‌విఎల్ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కరస్పాండెంటు ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారు నిర్వహించిన సీనియర్ బేస్‌బాల్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఎస్‌విఎల్ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబర్చారు. కొలుసు ప్రసాద్, గొరిపర్తి గోపికృష్ణ, బాలికల జట్టుకు ఉప్పాల శిరీష, పూజిత, నందిగం సాహితి, చాట్రగడ్డ ఐశ్వర్యం, బి మహాలక్ష్మి ఎంపికైనట్లు తెలిపారు. ఈ విద్యార్థులు 16, 17 తేదీలలో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. వీరిని కరస్పాండెంటు ఉమామహేశ్వరరావు, పీడీ గాజుల శ్రీనివాసరావు అభినందించారు. ఈనెల 17వ తేదీ ఉదయం 8గంటలు నుండి ఎస్‌విఎల్ క్రాంతి కళాశాల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు బాల, బాలికలకు జరుగుతాయని, జిల్లాలోని జూనియర్ కళాశాలల బాల బాలికలు పోటీల్లో పాల్గొన దలచిన వారు 17వ తేదీ ఉదయం 7గంటలకు పేర్లు నమోదు చేసుకోవాలని కరస్పాండెంటు కోరారు.

నేటి నుండి రాష్టస్థ్రాయి సీఎం కప్ బేస్‌బాల్ పోటీలు
* విస్తృత ఏర్పాట్లు * శాప్ ఏండీ భాస్కర్
విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 15: రాష్టస్థ్రాయి సీఎం కప్ బేస్‌బా ల్ పొటీలు ఈనెల 16 నుండి 18వరకు నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోనిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె భాస్కర్ తెలిపారు. స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆ ర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయ న పరిశీలించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ 13జిల్లాల నుండి పురుషుల, మహిళల విభాగంలో 26 జట్లు పాల్గొంటాయని, క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రతి జిల్లాల్లో ఒక్కొక్క క్రీ డాంశంలో పొటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా నగరంలో రాష్టస్థ్రాయి సీఎం కప్ బేస్‌బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోటీల నిర్వహణకు కోటీ 20లక్షలు కేటాయించిందని పే ర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వసతి సౌక ర్యం కల్పించడం జరిగిందని, సోమవా రం ఉదయం క్రీడాశాఖ మంత్రి ము త్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో మంత్రితో పా టు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వసతి, మంచినీరు, ఆహారం తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీరితో పాటు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కే మాధవీలత, జాయింట్ కలెక్టర్-2 కే మోహనకుమార్, సబ్‌కలెక్టర్ హెచ్ ఎం ధ్యానచంద్ర, డీఎస్‌ఎ సీఈఓ ఝూన్సీలక్ష్మీ, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ జోషి, చీఫ్ కోచ్ మహేష్, తదితరులు ఉన్నారు.