కృష్ణ

మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీంద్రనాధ్‌బాబు అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏస్పీ రవీంద్రనాధ్‌బాబు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952లో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన మహనీయుడని కొనియాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన పోరాట పటిమ యువతకు ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు వెంకట్రావు, చంద్రశేఖర్, ఆర్‌ఎస్‌ఐ సతీష్, సాయుధ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న సీఎం జగన్
అవనిగడ్డ, డిసెంబర్ 15: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గత ఆరు నెలల్లో అవినీతి, అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాలను నిలదీస్తుంటే సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారని స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం సమావేశమైన నేతలు మాట్లాడుతూ కేవలం అబద్దపు ప్రచారాలు చేయటమే ముఖ్యమంత్రి జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సంక్షేమం అనే పేరుతో రాష్ట్భ్రావృద్ధిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని, పోలవరం, అగ్రిగోల్డ్ వంటి అనే అంశాలపై ఏ విధంగా దుష్ప్రచారం చేశారో ఇప్పుడు అదే విధంగా అనని మాటలను అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మత్తి శ్రీనివాసరావు, మండలి వెంకట రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
కైకలూరు, డిసెంబర్ 15: మండల పరిధిలోని శృగవరప్పాడు గ్రామానికి చెందిన సైదు రుద్రరాజు (50) ఆదివారం ఉదయం 4గంటల సమయంలో కొల్లేరులో చేపల వేటకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల వివరాలు ప్రకారం సైదు రుద్రరాజు రోజు లాగానే తన తాటి దోనేలో కొల్లేరులో చేపల వేటకు వెళ్లాడని, ఆ సమయంలో రుద్రరాజుకు గుండెపోటు రావటంతో అక్కడిక్కడే మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు పీహెచ్‌సీకి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సమాచారం తెలుసుకున్న కొల్లేరు సంఘం అధ్యక్షుడు నభిగారి రాంబాబు, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ నాయకులు ముంగర నరసింహారావు, మాజీ సర్పంచ్ ఘంటసాల ఆంజనేయులు సందర్శించి నివాళులర్పించారు.