కృష్ణ

బ్రాహ్మణుల దశాబ్దాల కల సీఎం జగన్‌తో సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: బ్రాహ్మణులు దశాబ్దాలుగా కన్న కలలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సాకారం చేశారని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఆదివారం పట్టణంలోని కొత్త కల్యాణ మండపంలో నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లక్ష్యమన్నారు. గత ప్రభుత్వాలు వంశపారంపర్య హక్కు అమలుతో సహా అనేక సమస్యలు పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాగానే అర్చకుల వంశపారంపర్య హక్కు అమలు, ధూప దీప నైవేద్యాల పథకానికకి 234 కోట్ల కేటాయింపు తదితర ప్రయోజనాలను కల్పించారని అన్నారు. అర్చకులు ప్రశాంతంగా ఉంటనే పూజాదికాల నిర్వహణ సాధ్యమవుతుందని, వారికి గౌరవప్రదమైన వేతనం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, దానిలో సమస్యలు పరిష్కరించేందుకే కొన్ని నెలలు ఆ పథకాన్ని ఆపారని, అతి త్వరలోనే చైర్మన్ ఏర్పాటు సహా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలోను బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణులు రాజకీయాల్లోకి రావాలని, ఐకమత్యంతో ఉంటే అన్నీ సాధ్యమవుతాయని అన్నారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమానికి జగన్మోహనరెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతలు వివరిస్తూ 100 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అన్నారు. నియోజకవర్గంలో బ్రాహ్మణులకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బ్రాహణ్యం వర్థిలాలి అని కోరుకునే వారిలో ప్రథముడన్నారు. బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం కోసమే తమను ఎమ్మెల్యేలుగా గెలిపించారని అన్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విష్ణు అన్నారు. జగ్గయ్యపేట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మాదిరాజు కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో యువజన సంఘం అధ్యక్షుడు కొమరగిరి భరధ్వాజ్, హౌసింగ్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ ఈడీ జగన్నాధరావు, జున్నాభట్ల సూర్యనారాయణమూర్తి కె ఆంజనేయశర్మ, టి రామకృష్ణామాచార్యులు, చింతపల్లి శ్రీలత తదితరులు ప్రసంగించారు. సభలో ప్రముఖులు డాక్టర్ టీఎల్‌ఎన్ ఆచార్యులు, కీసర రాంబాబు, చిట్టా లక్ష్మీనరసింహశాస్ర్తీ, టి చక్రఫాణిరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణును ఘనంగా సత్కరించారు.