కృష్ణ

పేదలను ఆదుకోవడంలోనే సంతృప్తి ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించి వారిని ఆదుకోవటంలోనే సంతృప్తిని కలుగజేస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో మున్సిపాలిటీ వార్డు సచివాలయ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి నాని పాల్గొని వైఎస్‌ఆర్ నవశకం కింద బియ్యం, పెన్షన్ తదితర కార్డుల జారీ, ఇళ్ల స్థలాల అర్హుల జాబితాలు తదితర సంక్షేమ పథకాలను సమీక్షించారు. ఉగాది నాటికి రాష్ట్రంలోని అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంతో ఉందని తెలిపారు. ఇందుకోసం రూ.40వేల కోట్లను వ్యయం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అర్హత కలిగిన వారిలో ఒక్కరిని కూడా వదలకుండా అర్హుల జాబితాలో చేర్చి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం అందేలా పని చేయాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. నగరంలో ఇళ్ల స్థలాలు కోసం 21వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఇళ్ల స్థలాల అర్హత గల జాబితాలు, నవశకం కింద బియ్యం కార్డుల జారీ అర్హుల జాబితాలు గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించడం జరుగుతుందని, వాటిని ప్రజలు పరిశీలించి ఇంకా ఎవరైన అర్హులు ఉంటే నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు సక్రమంగా అందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వైఎస్‌ఆర్ నవశకం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టారన్నారు. ఆర్డీఓ ఎస్‌ఎస్‌కె ఖాజావలీ మాట్లాడుతూ సోషల్ ఆడిట్‌లో భాగంగా వివిధ పథకాల లబ్ధిదారుల జాబితాలు వార్డు సచివాలయాల వద్ద సోమవారం ప్రదర్శించి ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. అమ్మఒడి పథకాలు, కాపునేస్తం నియమనిబంధనలు, అర్హతలు మెప్మా పీడీ, ఎంపీడీఓ జివి సూర్యనారాయణ వివరించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శివరామకృష్ణ, తహశీల్దార్ సునీల్‌బాబు, ఎంఇఓ దుర్గాప్రసాద్, వీఆర్‌ఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.