కృష్ణ

జిల్లాలో సమృద్ధిగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 28: జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య ఋతుపవనాల కదలికలు చురుగ్గా ఉండటంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతోంది. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్న అన్నదాతలు ఈ ఏడాది నమోదవుతున్న అత్యధిక వర్షపాతంతో పులకించిపోతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి విడుదలపై ప్రభుత్వం నుండి స్పష్టత లేకపోయినా కురుస్తున్న వర్షాలు కొంతమేర ఊతమిస్తున్నాయి. తొలకరి ప్రారంభమైన నాటి నుండి నేటివరకు అంటే జూన్ 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం కన్నా 146.1 మి.మీలు అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం విశేషం. 89.9 మి.మీల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 235.0 మి.మీలు నమోదైంది. జిల్లాలో మొత్తం 50 మండలాలకు గాను 46 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదయింది. జగ్గయ్యపేట, వత్సవాయి, చందర్లపాడు, ఇబ్రహీంపట్నం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గుడ్లవల్లేరు మండలంలో అత్యధికంగా 366.0 మి.మీల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా 14 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. కానీ నేడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తమయ్యారు. ఇప్పటికే పలు మండలాల్లో నారుమడులు పోసిన రైతులు నాట్లకు సిద్ధమవుతున్నారు. అధిక వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నా సాగునీటి విడుదలపై నెలకొన్న సందిగ్ధత మాత్రం కలవరపరుస్తోంది. పూర్తిగా వర్షాలపై ఆధారపడి ఖరీఫ్‌ను అధిగమించలేమని, సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.