కృష్ణ

వెనుకబడిన ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 24: పట్టణంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పర్చేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక 16వ వార్డులో ఆదివారం ఆయన సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో రహదారి, డ్రైనేజీ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. స్థల యజమానులు కూడా ముందుకొచ్చి స్థలాలను మెరక చేయించాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని పారిశుద్ధ్య సిబ్బందిని ఆయన హెచ్చరించారు. 16వ వార్డులో ప్రధానంగా డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్య ఉందని అక్కడి ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మురుగునీరు బయటకు వెళ్ళేలా డ్రైన్‌లను అభివృద్ధి పరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొర్రా విఠల్, కౌన్సిలర్ బచ్చుల అనీల్ పాల్గొన్నారు.