కృష్ణ

ఆధునిక విజ్ఞాన భాండాగారాలుగా గ్రంథాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూలై 24: ఆధునిక విజ్ఞాన భాండాగారాలుగా గ్రంథాలయాలను తమ ప్రభుత్వం తీర్చిదిద్ది పాఠకులతో పాటు విద్యార్థులకు కూడా ఉపయోగపడేలా కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఈడ్పుగంటి వెంకట రామయ్య చెప్పారు. మొవ్వ గ్రామంలో రూ.20 లక్షల గ్రంథాలయ సంస్థ నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ తాతినేని పిచ్చేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో గ్రంథాలయ పితామహులు అయ్యంకి వెంకట రమణయ్య, స్థలదాత మండవ వెంకట రంగయ్య చిత్రపటాలకు అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకట రమణయ్య జయంతి సందర్భంగా కేట్ కట్‌చేసి అతిథులకు పంచారు. ఈసందర్భంగా వెంకట రామయ్య మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి ప్రజలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య, మాజీ హెచ్‌ఎం తాతినేని రాందాస్, మొవ్వ ఎంపిపి కిలారపు మంగమ్మ, యార్లగడ్డ నరసింహారావు, గ్రంథాలయ కార్యదర్శి కృష్ణారావు, టిడిపి మండల అధ్యక్షులు పోతుల నాగదేవ చంద్రహాస్, వైస్ ఎంపిపి నన్నపనేని వీరేంద్ర, చిందా వీర వెంకట నాగేశ్వరరాజు, పామర్తి విజయశేఖర్ పాల్గొన్నారు.