కృష్ణ

తిరుపతమ్మ ఆలయంలో ఘనంగా శాకంబరి ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, జూలై 24: కొలిచిన వారికి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పెనుగంచిప్రోలు శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారు ఆదివారం భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. దుర్ముఖి నామ సంవత్సరం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు ఇచ్చిన కూరగాయలు, ఆకు కూరలు, పలు పండ్లతో శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని మరియు సహదేవతలను అర్చకులు శాకంబరిగా అలంకరించారు. శాకంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తెల్లవారుజాము నుండే బారులుతీరారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని పాలపొంగళ్లు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం రఘునాథ్, పాలకమండలి చైర్మన్ కర్ల వెంకట నారాయణలు పర్యవేక్షించారు. కాగా శాకంబరి ఉత్సవాన్ని పురస్కరించుకొని వేద పండితులు ఆలయంలో చండీహోమాన్ని నిర్వహించారు. శాకంబరి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం గ్రామంలో అమ్మవారి రథోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలోని తిరుపతమ్మ, గోపయ్య స్వాముల ఉత్సవ మూర్తులకు అర్చకుడు మర్రెబోయిన వెంకట రమణ ఆధ్వర్యంలో కార్యనిర్వహణ అధికారి ఎం రఘునాధ్, ఆలయ చైర్మన్ కర్ల వెంకట నారాయణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులను బయటకు తీసుకువచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పలు పండ్ల రకాలతో అలంకరించిన రధంపై అధిష్టింపజేశారు. తదుపరి ఆచారం ప్రకారం గ్రామానికి చెందిన శాలివాహనులు, రజకులు, యాదవులు ప్రత్యేక క్రతువులు నిర్వహించారు. అనంతరం గ్రామంలో రథోత్సవం జరిగింది. మహిళలు అమ్మవారి రథం ముందు వార్లు పోస్తూ కొబ్బరికాయలు కొడుతూ తమ భక్తిని చాటుకున్నారు. తూర్పు బజారుకు చెందిన చిన్నారులు నిర్వహించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎఇఒ రెడ్డి, ఇఇ రమేష్, డిఇ రమ, పాలకమండలి సభ్యులు కోడె వెంకటేశ్వరరావు, బొల్లం లింగయ్య, మాజీ దేవస్థానం చైర్మన్ నూతలపాటి చెన్నకేశవరావు, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ రైతులు గ్రామంలోని ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు.