కృష్ణ

రైతులకు ప్రయోజనకరం ఫసల్ బీమా యోజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, ఏప్రిల్ 7: దేశంలో ఏ కష్టం వచ్చినా మొదటి కష్టం రైతులకే వస్తుందని, అన్నం పెట్టే రైతన్నకు పకృతి వైపరీత్యాలు, ఇతర కారణాల వల్ల ఏర్పడే ఇబ్బందులు తొలగించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టారని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్(నాని) అన్నారు. గురువారం మండలంలోని గరికపాడు క్రిషి విజ్ఞాన కేంద్రంలో ప్రొగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం రాజశ్రీ ఆధ్వర్యంలో ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన కిసాన్ సమ్మేళనాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో 60శాతం మంది వ్యవసాయ ఆధారితంగా జీవిస్తున్నా సగటు ఆదాయం వ్యవసాయం నుండి 26 శాతం మాత్రమే వస్తుందని, రైతుల పంటలు చేతికి అందివచ్చిన సమయంలో ఏదో ఒక రూపంలో విపత్కర పరిస్థితులు ఏర్పడి పంట నష్టం జరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గతంలో వ్యవసాయ బీమా సక్రమంగా అమలు కాలేదని, ప్రీమియం ఎక్కువ కట్టడం, పంట నష్టం జరిగినప్పుడు క్లైయిమ్‌లు చెల్లించకపోవడం జరిగిందన్నారు. రైతు దేశానికి వెనె్నముక అన్న ఉద్దేశంతోనే మోదీ తక్కువ ప్రీమియంతో రైతులకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతుల సూచనలు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని, పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. ఈ ఏడాది నీటి కోసం తీవ్ర విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయని, దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ప్రజలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ పూర్తి చేసి పోలవరానికి అధిక నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తుందని, పోలవరం నిర్మాణం వల్ల ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రతి రైతు పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేయాలన్నారు. కెవికెలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలకు వసతి గృహ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించాలని ఎంపిని కోరారు. వంద ఎకరాల విస్తీర్ణం కలిగిన కెవికెలో 50ఎకరాలకే నీటి లభ్యత పరిమితం కావడం వల్ల క్షేత్ర స్థాయిలో పంట విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించడానికి ప్రభుత్వాలు సహకారం అందించాలని కోరారు. ఫసల్ బీమా యోజన పథకం బ్రోచర్‌లను ఆవిష్కరించిన ఎంపి, ఎమ్మెల్యేలు కెవికెలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లాంఫామ్ సహసంచాలకులు డాక్టర్ పి రత్నప్రసాద్, డిసి అధ్యక్షుడు వేగినేటి గోపాలకృష్ణమూర్తి, కాచవరం బ్రాంచి కెనాల్ అధ్యక్షుడు యానాల గోపీచంద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, జడ్‌పిటిసి అమ్మనబోయిన రాణి, కెవికె శాస్తవ్రేత్తలు, వ్యవసాయ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.