కృష్ణ

హరితాంధ్ర సాధిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 9: హరితాంధ్రప్రదేశ్ సాధనకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ‘వనం-మనం’ కార్యక్రమంలో భాగంగా బందరు నియోజకవర్గంలో మంగళవారం ఒక్కరోజే ఐదు లక్షల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికార, అనధికారులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థి లోకాన్ని భాగస్వామ్యం చేశారు. ఊరూరా, వాడవాడలా పెద్దఎత్తున మొక్కలు నాటారు. అలాగే విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలకు పెద్దఎత్తున మొక్కలు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని సుల్తానగరం, మూడు స్తంభాల సెంటరు, కోనేరు సెంటరు, పోతేపల్లి జ్యూయలరీ పార్కు, చిలకలపూడి, ఎల్‌ఐసి కార్యాలయం, రాంజీ హైస్కూల్, కాలేఖాన్‌పేట, చిన్నాపురం, 38వ వార్డు, 1వ వార్డులలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి రవీంద్ర పాల్గొని మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. మానవాళికి జీవనాధారమైన మొక్కల పెంపకంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23శాతం ఉన్న వనాలు రానున్న నాలుగైదేళ్లలో 50 శాతం పెంచాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. మొక్కలు నాటితే సరిపోదని వాటి సంరక్షణ చర్యలు కూడా తీసుకోవాలన్నారు. భారత్ సాల్ట్స్, బెల్ కంపెనీ, ఎల్‌ఐసి వంటి సంస్థలు మొక్కల సంరక్షణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మొక్కలను పెంచే విద్యార్థులకు మార్కులు, ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఉద్యోగుల బదిలీల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాథరావు, టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ చైర్మన్ కాశీవిశ్వనాథం, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణప్రసాద్, టిడిపి పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు ఇలియాస్ పాషా, తలారి సోమశేఖర్, జ్యుయలరీ పార్కు ప్రతినిధులు చలమలశెట్టి నరసింహరావు, సుబ్బారావు, ఎల్‌ఐసి డివిజనల్ మేనేజర్ బాలయ్య చౌదరి, ఎంపిడివో జివి సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు పాల్గొన్నారు.