కృష్ణ

అంతటా పుష్కర శోభ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 11: పవిత్ర కృష్ణానదీ పుష్కర స్నానాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుండి 12రోజుల పాటు అత్యంత వైభవంగా కృష్ణా పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలు పుష్కర కళను సంతపరించుకున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత మూడు నెలల నుండి కృష్ణా పుష్కరాల నిర్వహణపై తలమునకలైన అధికార యంత్రాంగం రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ రక్షణ చర్యలు చేపట్టింది. విజయవాడ నగరంతో పాటు తూర్పు, పశ్చిమ కృష్ణాలోని నదీ పరీవాహక ప్రాంతంలోని పుష్కర నగర్‌లు, పుష్కర ఘాట్లు సుందరంగా రూపుదిద్దుకున్నాయి. పుష్కర స్నానాలకు జిల్లాలో మొత్తం 91 ఘాట్లను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో విజయవాడ నగరంలో 29 ఘాట్లు ఉండగా మిగిలినవి తూర్పు, పశ్చిమ కృష్ణాలో ఉన్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి ఘాట్ల నిర్మాణం చేపట్టారు. గత పనె్నండేళ్ల క్రితం జరిగిన కృష్ణా పుష్కరాలకు మిన్నగా ఈ పుష్కరానికి భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. మూడు కోట్ల మందికి పైచిలుకు పుష్కర స్నానాలకు వస్తారని అధికారులు అంచనా వేశారు. పిండ ప్రదానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆత్మీయ ఆతిథ్యమిచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ప్రతి ఘాట్ వద్ద భోజనం, మంచినీటి వసతి కల్పించారు. పులిహోర, మజ్జిగ ప్యాకెట్లను స్వచ్ఛంద సంస్థలు అందించనున్నాయి. ప్రధానమైన ఘాట్లు, పుష్కర నగర్‌ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థినీ విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా దివిసీమ పుష్కర శోభను సంతరింప చేసుకుంది. పవిత్ర సాగరసంగమ ప్రాంతమైన హంసలదీవి, నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం, దక్షిణకాశిగా పేరొందిన మోపిదేవి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న పుష్కర ఘాట్లలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది. పుష్కర విధులు నిర్వర్తించే ఉద్యోగులకు వసతి సౌకర్యం కోసం ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఏదిఏమైనా నేటి నుండి 12 రోజుల పాటు జరగనున్న కృష్ణా పుష్కరాలు చారిత్రక ఘట్టంగా నిలిచిపోనున్నాయి.