కృష్ణ

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యాబోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం/ జి.కొండూరు, ఆగస్ట్ 17: ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యాబోధన జరుగుతోందని ఎపి మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ పవిత్రసంగమం ఘాట్‌లో విద్యాశాఖపై బుధవారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సదుపాయాలు, వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ పాఠశాలల్లోనే తమ పిల్లలను తల్లిదండ్రులు చేర్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు సరఫరా చేస్తున్నామన్నారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా నూతన స్కూలు భవనాలు నిర్మిస్తున్నామన్నారు. సాధారణ విద్యతో పాటు కంప్యూటర్ విద్యను కూడా ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇదంతా ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమన్నారు. బాలబాలికలు బడి బయట ఉండకూడదనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. పండితుల పోస్టులను, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్‌గ్రేడేషన్ చేశామన్నారు. ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలపై కేంద్రానికి త్వరలో ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఇంగ్లీషు మీడియంలోనే విద్యాబోధన చేస్తున్నామన్నారు. మోడల్ స్కూళ్ల ద్వారా మరింత పకడ్బందీగా విద్యను ఉచితంగా అందిస్తున్నామన్నారు. విదేశాల్లో చదువులకు ఉపకార వేతనాలు కూడా మంజూరు చేస్తున్నామని మంత్రి గంటా వివరించారు. చర్చాగోష్టిలో ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ప్రభుత్వ విద్యావ్యవస్థపై నమ్మకం పెరిగేందుకు మరింత కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని పలువురు కోరారు.