కృష్ణ

నందిగామలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, ఆగస్టు 27: నందిగామ ప్రాంతంలో శనివారం సాయంత్రం నుండి రాత్రి వరకూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొనగా గ్రామాల్లో గత రెండు రోజులుగా వరుణుడి కరుణ కోసం ఆలయాల్లో వరుణ జపాలు, హోమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శుక్రవారం ఒక మోస్తరుగా, శనివారం భారీగా వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నందిగామ పట్టణంలో రహదారులపై వర్షపు నీరు ప్రవహించింది. పలు రహదారులు బురదమయంగా మారడంతో వాహన చోదకులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. పట్టణ ప్రధాన రహదారిలో పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరడంతో బకెట్ల ద్వారా నీటిని బయటకు పోశారు. ప్రధానంగా పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్న పాటి వర్షం కురిసినా రహదారిపై నుండి వర్షపునీరు ప్రవహిస్తోంది.