కృష్ణ

బందరు జలమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఆగస్టు 27: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. సుమారు మూడు గంటలు కురిసిన భారీ వర్షానికి పట్టణం చెరువును తలపించింది. డ్రైన్లలో పారుదల లోపించటంతో ఈ పరిస్థితి నెలకొంటోంది. కోనేరుసెంటరు నుండి లక్ష్మీటాకీసు సెంటరు వరకు ఉన్న ప్రధాన రహదారి రెండు అడుగుల లోతు నీటితో నిండిపోయింది. ప్రయాణికులు, పాదచారులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. బస్టాండ్‌లో భారీగా వర్షపు నీరు నిలిచిపోవటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పలు పాఠశాలలు, కళాశాలలు, కనె్వంట్లకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు వర్షంలో తడిసిముద్దయ్యారు. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న తరుణంలో వర్షం కురవడంతో కేరింతలు కొట్టారు. డ్రైవర్స్ కాలనీ, ఖాలేఖాన్‌పేట, శివగంగ, శారదాగనర్, సుల్తానగరం, ఎస్టీ కాలనీ, రైల్వేపేట, వైఎస్‌ఆర్ కాలనీ, పెయింటర్స్ కాలనీ, తదితర పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే పాదచారులు, వాహనచోదకులు, విద్యార్థులు ఇబ్బందిపడినా పట్టణవాసులు వర్షానికి సేదతీరారు.