కృష్ణ

చిగురిస్తున్న రైతన్నల ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 27: జిల్లాలో మళ్లీ ఏరువాక ప్రారంభమైంది. వర్షాభావ పరిస్థితులు, మండుటెండల కారణంగా వేలాది ఎకరాల్లో వేసిన నారుమడులు ఎండిపోగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పుణ్యమాని కురుస్తున్న వర్షాలకు మళ్లీ రైతులు పొలంబాట పట్టారు. ఎండిపోయిన నారుమడుల స్థానంలో మళ్లీ పోస్తున్నారు. ఎండిపోయేందుకు సిద్ధంగా ఉన్న నారుమడులు ఈ వర్షాలకు జీవం పోసుకుంటున్నాయి. గత నెలా 15రోజులుగా అధిక ఉష్ణోగ్రతల వల్ల జిల్లాలో ఆకుమడులు, నాట్లు వేసిన వరిపొలాలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో వరుణ దేవుడు నేనున్నానంటూ కరుణించటంతో ఎండిపోయే దశకు చేరుకున్న నారుమడులు, వరి పొలాలు తెప్పరిల్లాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు కాలువలకు కొద్దిపాటి నీటిని విడుదల చేయటంతో మరలా ఏరువాక ప్రారంభమైంది. ఖరీఫ్ సాగు చేయలేక చేతులెత్తేసిన రైతన్నల ఆశలను ఈ వర్షాలు చిగురింపజేశాయి. వర్షాలకు కొందరు రైతులు నాట్లు కూడా వేస్తున్నారు. అధిక శాతం మంది రైతులు దేవునిపై భారం వేసి ట్రాక్టర్ ద్వారా విత్తనాలను వెదజల్లారు. అయితే రైతుల మొర ఆలకించిన వరుణ దేవుడు నేనున్నానంటూ వర్షం రూపంలో కరుణ చూపించటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖరీఫ్ సమయం నెలరోజులు దాటిపోవటంతో రెండో పైరుపై ఆశలు వదలుకున్నారు. రెండో పంట ఎలా ఉన్నా ఖరీఫ్ సాగు గట్టెక్కితే చాలని ఎక్కువ శాతం మంది రైతులు భావిస్తున్నారు. ఈ సమయంలో వరి విత్తన కేంద్రాలు రైతులతో కళకళలాడుతున్నాయి. మొన్నటివరకు ఎండిపోతున్న వరి పొలాలను చూసి కన్నీటిపర్యంతమైన రైతుల మోముల్లో వర్షం ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఎంతోకొంత నారుమడి ఉపయోగపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగోలా నారుమడిని రక్షించుకున్న రైతులు మాత్రం ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుని యుద్ధప్రాతిపదికన నాట్లు వేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం బందరు మండలంలో భారీ వర్షం కురవడటంతో రైతుల ఆశలు రెట్టింపయ్యాయి. ఏదిఏమైనా వర్షాలు లేక అల్లాడుతున్న రైతన్నలు, పశుపక్ష్యాదులకు వర్షాలు ఊరటనిస్తున్నాయి.