కృష్ణ

నిమ్మలూరుకు ‘బెల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 27: జిల్లాలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కంపెనీ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటివరకు జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొనసాగుతున్న బెల్ కంపెనీని పామర్రు మండలం నిమ్మలూరు గ్రామంలో మరింతగా విస్తరించనున్నారు. రూ.300 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌కు నిమ్మలూరు వద్ద సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. రక్షణ రంగ సంస్థలు ఉపయోగించే అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ పరికరాలను దేశంలోనే తొలిసారిగా బెల్ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. అత్యంత నాణ్యతతో రాత్రిపూట కూడా స్పష్టంగా కనిపించే నైట్ విజన్ పరికరాల సహాయంతో యుద్ధ ట్యాంక్‌లు, మిలటరీ కమాండర్లు, సైనికులు శత్రువులను స్పష్టంగా చూడగలుగుతారు. ఇలాంటి పరికరాలు తయారుచేసే బెల్ కంపెనీ శాఖ జిల్లా కేంద్రం మచిలీపట్నంలో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీగా వ్యవహరించే దీన్ని 1980లో రక్షణ రంగ సంస్థ తన ఆధీనంలోకి తీసుకుంది. మచిలీపట్నంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ యూనిట్‌ను పామర్రు మండలం నిమ్మలూరు వద్ద 50 ఎకరాల్లో మరింతగా విస్తరించనున్నారు. ఇందుకు సంబంధించి శంకుస్థాపన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.