కృష్ణ

ప్రజాసమస్యలకు క్షేత్రస్థాయిలో పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 30: జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తే సమస్యలకు క్షేత్రస్థాయిలో పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ వాటి అమలుకు కృషి చేయాలన్నారు. సమగ్ర సమాచారంతో జెడ్పీ సమావేశాలకు రావాలని అధికారులకు సూచించారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో స్థారుూ సంఘ సమావేశాలు జరిగాయి. 2, 4వ స్థారుూ సంఘ సమావేశాలకు అధ్యక్షత వహించిన చైర్‌పర్సన్ అనూరాధ గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, తదితర అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు విధిగా ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి మంజూరయ్యే నిధుల వివరాలను కూడా ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తెలియచేయాలన్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ అక్కడక్కడా చిన్నపాటి లోటుపాట్లు కనిపిస్తున్నాయన్నారు. చాలామంది ఐరిస్, వేలిముద్రలు పడక పెన్షన్లు తీసుకునే విషయంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి అర్హులైన ప్రతిఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాలని డిఆర్‌డిఏ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 3లక్షల 20వేల 845 మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇవిగాక మరో 32వేల 718 మంది నూతన పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరికి కూడా త్వరలో మంజూరు చేస్తామన్నారు. జిల్లాలోని పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనకు బెంచీలు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణానికి 400 పాఠశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. వీటిపై త్వరగా చర్యలు తీసుకోవాలని డిఇఓ ఎ సుబ్బారెడ్డిని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటే విషయంలో ప్రధానోపాధ్యాయులు మక్కువ చూపడం లేదని అనూరాధ ఆవేదన వ్యక్తం చేశారు. విస్తారమైన పాఠశాలల ఆవరణలు ఉన్నప్పటికీ ఎందుకు మొక్కలు నాటడం లేదని డిఇఓను ప్రశ్నించారు. వెంటనే హెచ్‌ఎంల సమావేశం నిర్వహించి విధిగా ప్రతి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. మొక్కల సంరక్షణకు ఉపాధి హామీ పథకం కింద నిర్వహణ ఖర్చు కూడా ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నీటి కుంటల తవ్వకంలో జిల్లా వెనుకబడటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను చైతన్యపర్చడంలో డ్వామా అధికారులు విఫలమవుతున్నారన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటు కాకపోవడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ ఏర్పాటు చేయని పక్షంలో ఆస్పత్రి ఏవిధంగా అభివృద్ధి చెందుతుందని వైద్యాధికారులను ప్రశ్నించారు. తక్షణమే అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో పాత కమిటీనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణంపై జరిగిన చర్చలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద జిల్లాకు 4వేల 462 గృహాలు మంజూరయ్యాయన్నారు. యూనిట్ కాస్ట్ రూ.2 లక్షలుగా ప్రభుత్వం పేర్కొందన్నారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం 1, 7వ స్థాయి సంఘ సమావేశాలకు చైర్‌పర్సన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ దామోదర నాయుడు, జెడ్పీటిసిలు, ఎంపిపిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.