కృష్ణ

జ్వరాలతో అల్లాడుతున్న జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఆగస్టు 30: విషజ్వరాలతో మైలవరం పట్టణం అల్లాడుతోంది. గత కొన్ని రోజులుగా ఇంటింటికీ విషజ్వరాలు సోకిన బాధితులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులన్నీ జ్వరపీడితులతో కిటకిట లాడుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూలతో అనేక మంది బాధపడుతున్నారు. మైలవరం పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మైలవరంలోని ఒక ప్రైవేట్ చిన్నపిల్లల క్లినిక్ ఎదుట పసిపిల్లలతో తల్లులు పడుతున్న అవస్థలు దయనీయంగా కనిపించాయి. అదే పరిస్థితి అన్ని ఆసుపత్రుల్లో నెలకొంది. ఇటీవల రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో డెంగ్యూ సోకి అనేక మంది ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఐతే ప్రస్తుతం అన్ని గ్రామాల్లో అంటురోగాలు సోకి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పారిశుద్ధ్య పరిస్థితి అస్తవ్యస్తంగా మారి అంటువ్యాధులు ప్రబలుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తాగునీటిలో క్లోరినేషన్ చేయాలని, పారిశుద్ధ్యం మెరుగుకు గ్రామ పంచాయతీలు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గ్రామాలకు వైద్య సిబ్బందిని పంపి రక్త పరీక్షలు చేయించి అవసరమైన మందులు అందించాలని కోరుతున్నారు. మరోవైపు జలుబు, దగ్గు, జ్వరంతో పసిపిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.