కృష్ణ

కార్మికుల సమ్మె విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, సెప్టెంబర్ 2:దేశంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వివిధ కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె నూజివీడు డివిజన్‌లో విజయవంతం అయింది. పట్టణంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వీరు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలకు బ్రహ్మరథం పడుతున్నాయని, ఫలితంగా కార్మికులు పలు విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎ ఐటియుసి నాయకులు చలసాని వెంకట రామారావు, అక్కినేని వనజ, సి ఐటియు నాయకులు జి రాజుతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రవేటు కర్మాగారాలు మూతబడ్డాయి.