కృష్ణ

వాహనాల సర్వీసింగ్ కేంద్రాలుగా పుష్కరఘాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, సెప్టెంబర్ 4: లక్షలాది మంది పుష్కర పుణ్య స్నానాలు ఆచరించిన పుష్కర ఘాట్లు నేడు వాటర్ సర్వీసింగ్ ఘాట్లుగా మారాయి. నీటిపారుదల శాఖ నిబంధనల ప్రకారం జీవనదుల్లోగాని పంట కాలువలు, ఊరు చెరువుల్లో మోటారు వాహనాలు వాటర్ సర్వీసింగ్ చేయరాదు. ఇంజినాయిల్, మడ్డి వాహనాల మురికి వల్ల జీవ జలం రసాయనాలతో కలుషితమవుతాయి. అందువల్ల వాటర్ సర్వీసింగ్ చేయరాదు. కానీ భవానీపురం కరకట్ట ప్రాంతాల్లోని పున్నమి ఘాట్, భవానీ ఘాట్‌లలో నేడు చిన్న కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లు వాటర్ సర్వీసింగ్ చేస్తున్నారు. వాహనాల మడ్డి, మట్టి శుభ్రంగా వదిలించడం వల్ల ఆ మలినాలు నదిలో కలుస్తున్నాయి. ఎంతో తేటగా స్వచ్చంగా ఉండే కృష్ణానదీ జలాలు పోలవరం కాలువ నీటి రాకతో గోదావరి నది మురుగునీరుతో కృష్ణానది జలాలు స్వరూపం మారిపోయాయని అలాగే వింత వింత ముళ్ల చేపలు గోదావరి నీటితో నదిలో చేరాయని నగరవాసులు భయభ్రాంతులకు గురువుతున్నారు. ఆరోగ్యం పట్ల అవగాహనతో నగరవాసులు నిత్యం వేలాది మంది కృష్ణానదిలో ఈతకొడుతున్నారు. దాంతో గోదావరి మురుగు, వాహనాల సర్వీసు మురికి వెరశి నదీ జలాలు కలుషితమవుతున్నాయని స్విమ్మర్స్ ఆందోళన చెందుతున్నారు.