కృష్ణ

ఎంపిపిగా రాజులపాటి ఏకగ్రీవ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, సెప్టెంబర్ 29: పెడన ఎంపిపిగా రాజులపాటి అచ్యుతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి రామారావు ఎన్నికను నిర్వహించారు. మొత్తం 9 మంది సభ్యులకు గాను వైకాపా సభ్యులు ఐదుగురు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. టిడిపి సభ్యులు గైర్హాజరయ్యారు. వేరే ప్రతిపాదన రాకపోవటంతో అచ్యుతరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం నూతన ఎంపిపి చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.