కృష్ణ

టిడిపికి తేరుకోలేని షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, సెప్టెంబర్ 29: పెడన రాజకీయ చరిత్రలో మరుపురాని సంఘటన జరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా మున్సిపల్ ఛైర్మన్, మండల పరిషత్ అధ్యక్ష పదవులను ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. గురువారం జరిగిన ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ పన్నిన వ్యూహాన్ని వైకాపా చిత్తుచేసింది. పురపాలక సంఘ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టిడిపికి మెజార్టీ ఉన్నప్పటికీ వైకాపా వ్యూహాత్మకంగా వ్యవహరించి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ ఓటుతోనే చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. వైకాపాకు చెందిన 3వ వార్డు కౌన్సిలర్ బండారు ఆనంద ప్రసాద్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మండల పరిషత్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో తగినంత మెజార్టీ లేని తెలుగుదేశం ఎన్నికకు ముందడుగు వేయలేదు. దీంతో ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజులపాటి అచ్యుతరావు ఎంపిపిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఫలితాలు టిడిపికి కంగుతినిపించాయి. సొంత పార్టీకి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ లంకే శ్రవంతి ప్రతిపక్షానికి మద్దతుగా ఓటు వేయటంతో అందరూ నిశే్చష్ఠులయ్యారు. ఈ ఎన్నిక విషయంలో వైకాపా అత్యంత రహస్యంగా పన్నిన వ్యూహానికి ఫలితం కనిపించింది. వైకాపాకు బలం లేనప్పటికీ నామినేషన్ వేస్తున్నామని ఆ పార్టీ ప్రకటించినప్పటికీ ఉన్న బలాన్ని నిరూపించుకుని పార్టీ పరువును కాపాడుకునేందుకే బరిలో నిలుస్తున్నారని అంతా అనుకున్నారు. అయితే టిడిపి నుంచి 15వ వార్డు కౌన్సిలర్ శ్రవంతి ఊహించని విధంగా వైకాపాకు ఓటువేసి టిడిపికి పెద్ద షాక్ ఇచ్చారు. ఇదంతా సాక్షాత్తూ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సమక్షంలోనే జరగటం విశేషం. ఈ హఠాత్పరిణామానికి కాగిత నోటమాట రాలేదు. ఒక్కసారిగా ఆయన నిర్ఘాంతపోయారు. నిన్నటివరకు టిడిపి శిబిరంలోనే ఉన్న శ్రవంతి సభ్యులందరితో పాటే కౌన్సిల్ హాలులోకి వచ్చి వైకాపాకు ఓటు వేయటం టిడిపి నాయకులకు మింగుడుపడలేదు. మొత్తం 22 మంది సభ్యులకు గాను టిడిపికి 11, వైకాపాకు 11 మంది ఉండగా ఎమ్మెల్యే ఓటుతో టిడిపి గెలవాల్సి ఉంది. అందుకు భిన్నంగా శ్రవంతి మద్దతుతో వైకాపా ఒక ఓటు మెజార్టీతో గట్టెక్కేసింది. చేతులెత్తే విధానంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ జి వరప్రసాదరావు ఈ ఎన్నికను నిర్వహించారు. తొలుత టిడిపి నుంచి శ్రవంతి మినహా 10 మంది చేతులెత్తటంతో ఎమ్మెల్యేతో పాటు మిగిలిన సభ్యులంతా షాక్ తిన్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే కాగిత నాలుగుసార్లు శ్రవంతి సీటు దగ్గరకు వెళ్ళి చేయి ఎత్తాలని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ ఆమె కరుణించలేదు. ఆ తరువాత వైకాపా సభ్యులు 11 మంది చేతులెత్తటంతో శ్రవంతి కూడా వారికి మద్దతు పలికారు. శ్రవంతి ప్రవర్తనతో బిత్తరపోయిన టిడిపి నాయకులు ఆమె మద్దతు కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కూడా టిడిపి సభ్యుడు బెజవాడ నాగరాజు మాట్లాడించినా ఫలితం లేకుండా పోయింది. టిడిపి అభ్యర్థి ఆనందరావును నాగరాజు ప్రతిపాదించగా భిక్షం బలపర్చారు. వైకాపా అభ్యర్థి ఆనందప్రసాద్‌ను చంద్రబాబు ప్రతిపాదించగా మెట్ల గోపిప్రసాద్ బలపర్చారు. ఒక ఓటు మెజార్టీతో బండారు గెలిచినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆనంద ప్రసాద్ చేత ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకరాం చేయించారు.
విలపించిన టిడిపి సభ్యులు
ఎప్పుడైతే ఆనందరావు ఓటమి చెందారో టిడిపి కౌన్సిలర్లు ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లు అంతా భోరున విలపించారు. ఆఖరి క్షణం వరకు మన వెంటనే ఉండి వెన్నుపోటు పొడిచిన శ్రవంతి వ్యవహార శైలిని మహిళా కౌన్సిలర్లు జీర్ణించుకోలేకపోయారు. అయితే టిడిపి తరపున మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, ఎంపి సోదరుడు కొనకళ్ళ బుల్లయ్య తీవ్రస్థాయిలో గెలుపు కోసం ప్రయత్నించగా మీసాలు కూడా సరిగ్గా రాని వైకాపా కౌన్సిలర్లు ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ఆంబోతులను లేగదూడలు కుమ్మేశాయని పట్టణంలో చర్చించుకుంటున్నారు.
వైకాపా విజయోత్సవం
మున్సిపల్ ఛైర్మన్, ఎంపిపి ఎన్నికల్లో గెలుపొందిన వైకాపా పట్టణంలో భారీ విజయోత్సవం నిర్వహించింది. నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రామ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్పులతో సంబరాలు నిర్వహించారు. వైకాపా జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థసారథి కూడా ఈ ర్యాలీలో పాల్గొని నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఇదిలావుండగా రామ్‌ప్రసాద్‌కు వైకాపా అధినేత జగన్ ఫోన్ చేసి అభినందించారు.