కృష్ణ

లాభసాటి వ్యవసాయం చేస్తేనే రైతులు అభివృద్ధి చెందుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, అక్టోబర్ 13: వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి రెండు మూడింతలు లాభం వస్తేనే నిజమైన వ్యవసాయమని, ఇందుకు రైతులు శాస్తవ్రేత్తల సలహాలు, సూచనలు పాటిస్తు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించటం ఎంతో అవసరమని ఏపి ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. మండలంలోని చాగంటిపాడులో విఘ్నేశ్వర రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నాబార్డు రూ.6 లక్షలు, ఉద్యానశాఖ రూ.6 లక్షలు ఆర్థిక సహాయంతో నిర్మించిన వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్ర భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతు చాగంటిపాడులో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాన్ని రైతులే ఏర్పాటు చేసుకోవటం శుభపరిణామని అన్నారు. షాపింగ్ మాల్స్‌లో కిలో ఉల్లి రూ.14 అమ్ముతున్నారని, ఇదే ఉల్లిని రైతునుంచి రూ.4లకు వ్యాపారులు కొనుగోలు చేస్తు వ్యాపారులు లబ్ది పొందుతున్నారని, కనుక మార్కెటింగ్ నెట్‌వర్క్‌ని రైతులు విస్తరించుకోవటంపై దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో రైతులు డ్రిప్ ఇరిగేషన్‌తో పసుపు పంటలో అధిక దిగుబడులు సాధిస్తు లాభాలు పొందుతున్నారని వివరించారు. కృష్ణాజిల్లాలో పండిస్తున్న పసుపులో రంగుశాతం తక్కువగా ఉంటోందని, దీనివల్ల సరైన రేటు లభించటం లేదని అన్నారు. అలాగే అరటి పంట కూడా బాగోలేదని, అరటి గెలలు మూడవ రకానికి చెందినవిగా ఉన్నాయన్నారు. మంచి బలంతో అరటిగెల ఉంటే అధిక ధర వస్తుందని తెలిపారు. అందరు కర్పూరం ఒక ఎకరంలో, మరొకరకం అరటిని ఇంకొక ఎకరంలో సాగుచేసి ఏది ఎక్కువ లాభాలను ఇస్తుందో గ్రహించాలని చిరంజీవి చౌదరి తెలిపారు. ఇలాంటి మెళకువలతో వ్యవసాయం చేయాలంటే రైతులకు వ్యవసాయ విజ్ఞానం అవసరమని ఆయన అన్నారు. కనుక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని, రైతులు ఉపయోగించుకోవాలని కోరారు.
పసుపుపంటకు బీమా
లంకల్లో వందలాది ఎకరాల్లో పసుపు పంటని రైతులు సాగుచేస్తు వరదలు వస్తే నష్టపోతున్నారని, కాని ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవటంతో లక్షల్లో నష్టం జరుగుతోందని చిరంజీవి చౌదరి దృష్టికి ఓ రైతు తీసుకు వచ్చారు. దీంతో స్పందించిన ఆయన కృష్ణాజిల్లాలో కూడా పసుపు పంటకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కార్యక్రమంలో నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి టి విజయ్, తహశీల్దార్ జి భద్రు, ఇక్రిసాట్ జిల్లా కో ఆర్డినేటర్ ఆర్ శ్రీకాంత్ పలువురు రైతులు పాల్గొన్నారు.