కృష్ణ

కృష్ణాజిల్లా మత్స్యశాఖ విధానంలో నూరు శాతం లక్ష్యాలు అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 28: రాష్ట్రంలో రెండింతల ప్రగతి సాధించడంలో వివిధ శాఖల పనితీరు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అందుకనుగుణంగా ప్రణాళికలను రూపొందించాల్సి ఉందని వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను, అధికారులను ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నా వాటి ప్రచారంపై తగిన విధంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లలేకపోతున్నారని ముఖ్యమంత్రి తెలియజేశారు. డిసెంబర్ 14, 15న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ సమావేశానికి ఆయా జిల్లాల స్థాయిలో రెండింతల ప్రగతికి సంబంధించి చేపట్టనున్న పూర్తి సమగ్ర సమాచారంతో హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మలేషియాకు చెందిన ‘పెమాండో’ చేపట్టిన కార్యాచరణ ప్రణాళికలను పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగిందని అందులో ఉత్తమమైన విధానాలను రాష్ట్రంలో అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాల, అధికారుల, మంత్రుల పనితీరును వారు చూపే ప్రతిభ ఆధారంగా రెడ్, గ్రీన్, ఎల్లో ర్యాంకులను కేటాయించి సమీక్షించడం జరుగుతుందని వారు ఏ ర్యాంకులో ఉండాలో నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి చమత్కరించారు. ఈ సమీక్షలో భాగంగా గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ అనుమంధ రంగాల, గృహ నిర్మాణం, విద్యుత్, రోడ్లు, భవనాల, ప్రణాళికా విభాగం, మానవ వనరులు, జలవనరులు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ తదితర శాఖల రెండింతల ప్రగతిపై సమీక్షించారు.

30న చంద్రన్న రుణమేలా
* సమీక్షించిన సబ్ కలెక్టర్ నాగలక్ష్మి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 28: ఈనెల 30న నిర్వహించనున్న చంద్రన్న రుణమేళా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా షెడ్యూలు కులాల సేవా సహకార సంఘం, షెడ్యూలు తెగల సేవా సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చంద్రన్న రుణమేళా కార్యక్రమం ఏర్పాట్లపై శనివారం ఉదయం సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆమె కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 30న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు చంద్రన్న రుణమేళా కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఆమె అధికారులకు సూచించారు. కార్యక్రమానికి షెడ్యూలు కులాలు, తెగలకు చెందిన దాదాపు 15,000 మంది లబ్ధిదారులు హాజరుకానున్నారని తెలిపారు. లబ్ధిదారులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా 350 కోట్ల రూపాయల విలువైన ఉపకరణాలను పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. రుణమేళాకు హాజరయ్యే లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి సౌకర్యంతో పాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమానికి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్‌శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సభావేదిక ఏర్పాట్లతోపాటు వేదికపై డా.బిఆర్ అంబేద్కర్ బాబుజగ్జీవన్‌రామ్ చిత్రపటాలను ఉంచాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేయటంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. లబ్ధిదారులకు రుణాలు మంజూరుచేసిన బ్యాంకు అధికారులు కార్యక్రమానికి హాజరయ్యేలా లీడ్ బ్యాంక్ మేనేజర్ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు బాధ్యతలను అప్పగించిన అధికారులు అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి చంద్రన్న రుణమేళాను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని సబ్ కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎన్‌వివి సత్యనారాయణ, డిఆర్‌డిఎ పిడి చంద్రశేఖరరాజు, సాంఘిక సంక్షేమశాఖ డిడి సునీల్ రాజ్‌కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ రాజేంద్రప్రసాద్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

దుర్గగుడి ఆదాయానికి గండికొడుతున్న మంత్రిగారి సిఫార్సు
ఇంద్రకీలాద్రి, నవంబర్ 28: దుర్గగుడిలో కాలపరిమితి ముగిసినా లీజు హక్కును తిరిగి ఏదో విధంగా పొడిగించి పాత వ్యక్తికే ఈ హక్కును కల్పించాలని సాక్ష్కాత్తూ దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి నుండి సిఫారస్ రావటంతో దుర్గగుడి ఇవో సిహెచ్ నరసింగరావుకు పెద్దతలనొప్పి వ్యహారంగా మారినట్లు సమాచారం. కాలపరిమితి ముగిసినా లీజ్ హక్కును పొడిగించే అవకాశం లేదని దీనికి వలన అనేక సమస్యలు తలెత్తుతాయని చెప్పినప్పటికీ మంత్రి కార్యాలయ సిబ్బంది అంగీకరించకపోవటంతో దుర్గగుడి అధికారులకు ఈవ్యవహారం పెద్ద సమస్యగా మారింది. దారాలు, తాడులు విక్రయించుకోవటానికి ఒక వ్యక్తికి 6నెలలకు దుర్గగుడి అధికారులు హక్కును కల్పించారు. 4రోజుల క్రితమే లీజ్ హక్కు కాలపరిమితి ముగిసిన వెంటనే ఈసెక్షన్ అధికారులు వెంటనే ఈలీజ్ హక్కును రద్దు చేశారు. లీజ్ హక్కు ముగియటానికి కొద్ది రోజుల ముందు నుండే లీజుదారునికి సమీప బంధువయిన స్థానిక ప్రజాప్రతినిధి ఈవ్యవహారంలో మంత్రి స్థాయిలో చక చక పావులు కదుపుతున్నారు. లీజు హక్కు ముగిసినప్పటికీ తిరిగి హక్కును వారి బంధువులకు ఇప్పించేందుకు ఈప్రజాప్రతినిధి శక్తి మేరకు ఈశాఖ మంత్రితో చేత సిఫారస్ చేయించి శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివారి దేవస్థానం అధికారులపై ఒత్తిడి తీసుకురావటం ప్రారంభించారు. ఈ వ్యవహారం గమినించిన ఇవో సిహెచ్ నరసింగరావు లీజు హక్కు ముగిసిన వెంటనే లీజు హక్కును రద్దు చేస్తూ సంబంధింత సెక్షన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధి శనివారం ఉదయం నుండే మంత్రి చేత సిఫారస్ చేయిస్తూ దుర్గగుడి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికితోడు ఇవో సిహెచ్ నరసింగరావు అంగీకరించలేదు. గతంలో ఒక షాప్ నిర్వాహకుడు తాను ప్రతినెల దుర్గగుడి దేవస్థానానికి అద్దె రూపంలో సుమారు 90వేలు చెల్లిస్తుండగా పక్కనే వ్యాపా రం చేస్తున్న వ్యక్తి కేవలం రూ.5వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్న కారణంగా దేవస్థానం అదాయానికి గండిపడుతోందని వినతి పత్రం సైతం దుర్గగుడి ఇవోకు సమర్పించారు. ఈవ్యహారం గమినించిన ఇవో 5వేలు అద్దె లీజు ముగిసిన వెంటనే రద్దు చేశారు. రూ.5వేలు అద్దె చెల్లిస్తున్న వ్యక్తికే తిరిగి లీజును పొడిగించాలని మంత్రి సిఫారస్. దీంతో ఇవో శనివారం రూ.90వేలు అద్దె చెల్లిస్తున్న పాటదారున్ని పిల్చి మాట్లాడినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా లభించిన సమాచారం. ఈవ్యవహారంలో 90వేలు అద్దె చెల్లిస్తున్న పాటదారుని సోదరుడు దుర్గగుడి అధికారులు చేసిన సూచనను అంగీకరించపోవటంతో సంబంధిత అధికారులు పాటదారుని సోదరునితో కొంతమేరకు దూకుడుగా వ్యవహారించినట్లు తెలిసింది. దుర్గగుడి అధికారులు ఇద్దరు పాటదారుల మధ్య రాజీచేయటానికి ప్రయత్నాలు చేసినప్పటికీ శనివారం సాయంత్రానికి కూడ ముడిపడలేదని తెలిసింది. మంత్రి సిఫారస్‌ను అంగీకరించి దుర్గగుడి అధికారులు ఒక అడుగుముందుకేసే భవిష్యత్‌లో అందరు మంత్రుల చేత సిఫారస్ చేయటం ప్రారంభించే అవకాశాలు చాలా ఎక్కువవుతాయని దీనికి వలన దేవస్థానం ఆదాయానికి భారీస్థాయిలో గండిపడే అవకాశం ఉందని దుర్గగుడికి చెందిన ఒక సీనియర్ ఉద్యోగి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా శనివారం అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈసంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించిన కాంగ్రెస్ పార్టీ, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం నుండి దుర్గగుడిలో అధికార పార్టీ వ్యవహారం, వారి జోక్యం, తదితర అంశాలను అస్త్రాలను మలుచుకొని అధికార పార్టీ తీరును ఎండగట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా లభించిన కీలక సమాచారం...

నాణ్యత లేని
ఎల్‌ఇడి బల్బులు వాపసు!
కూచిపూడి, నవంబర్ 28: విద్యుత్ వినియోగంలో ఆదా చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10లకే పంపిణీ చేస్తున్న ఎల్‌ఇడి బల్బులు దైవాధీనంగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద బల్బుల పంపిణీ చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీలు నాశిరకానివి సరఫరా చేయటంతో మిణుకు మిణుకుమంటూ వెలిగి ఆరిపోతున్నాయి. దీంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. కొందరు వాటిని వాపసు చేస్తున్నారు.