కృష్ణ

అక్టోబర్ 18న సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వైద్యాలయానికి రూ.4కోట్లు అందించిన టీవీ 9 సీఇఓ రవిప్రకాష్
కూచిపూడి, ఏప్రిల్ 18: కూచిపూడిలో రూ.50 కోట్ల అంచనాలతో నిర్మిస్తున్న సిలికానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయం ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 18న ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించాలని రాష్ట్ర ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పనను నాట్యారామ కమిటీ చైర్మన్ కూచిపూడి ఆనంద్ కోరారు. కూచిపూడిలో సిలికానాంధ్ర వసుదైక కుటుంబం నిర్మిస్తున్న సంజీవని మల్టి స్పెషాలిటీ వైద్యాలయం నిర్మాణానికి టీవీ 9 చానల్ సీఇఓ రవి ప్రకాష్ రూ.4కోట్లను విరాళంగా అందజేసి నాట్యాచార్యులు, అభిమానుల కరతాళధ్వనులందుకున్నారు. బుధవారం వైద్యాలయం ఆవరణలో నాట్యారామ కమిటీ చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన సభలో రవి ప్రకాష్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి మతం, రాష్ట్రానికి కులతత్వాలు రూపుమాపితే ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శప్రాయమవుతుందన్నారు. సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ సంజీవని వైద్యశాల రాష్ట్రానికి ఆదర్శప్రాయమన్నారు. ఈ సందర్భంగా సతీష్ రూ.4లక్షలను, టీడీపీ మండల అధ్యక్షుడు తాతా వీరదుర్గాప్రసాద్ రూ.లక్షా వెయ్యి 116, కంచె పరిశుద్ధరాజు రూ.50వేలు, అంతర్వేది రూ.10వేలను విరాళంగా అందజేశారు. సమావేశంలో స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ సీఇఓ డా. గంగయ్య, డా. గంగాధరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సతీష్, నాట్యాచార్య వేదాంతం రాధేశ్యాం తదితరులు పాల్గొన్నారు. రవి ప్రకాష్‌ను గజమాల, అతిథులను దుశ్శాలువాలతో ఆనంద్ సత్కరించారు.

వైసీపీ ఎంపీలకు సాదర స్వాగతం
గన్నవరం, ఏప్రిల్ 18: గన్నవరం ఎయిర్‌పోర్టులో వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ నాయకులు సాదర స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం ఎయిరిండియా విమానంలో అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వర ప్రసాద్, మేకపాటి మిధున్ రెడ్డి, సత్యనారాయణ ఢిల్లీ నుండి ఇక్కడికి విచ్చేశారు. వీరికి ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ రక్షణ నిధి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు యరలమంచిలి రవి, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, నేతలు యార్లగడ్డ వెంకట్రావు, డాక్టర్ దుట్టా రామచంద్రయ్య, కారెబోయిన బాబ్జీ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం వారు రోడ్డు మార్గాన పార్టీ అధినేత జగన్‌ను కలిసేందుకు తరలివెళ్లారు.

అభివృద్ధికి శక్తి మేర కృషి చేస్తా
మండవల్లి, ఏప్రిల్ 18: తన శక్తి మేర కైకలూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టరు కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని అయ్యవారిరుద్రవరంలో రూ.3 కోట్లతో నిర్మించిన అయ్యవారిరుద్రవరం - చిగురుకోట బీటీ రోడ్డును, కానుకొల్లులో నిర్మించిన పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం, సిసి రోడ్డుకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై అభిమానం, నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయనన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కైకలూరులో రూ.8 కోట్లతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, ఇందులో కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో వైద్యసేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. నాలుగేళ్లు రాష్ట్భ్రావృద్ధిలో పాలు పంచుకున్నానని, మిగిలిన ఏడాది నియోజకవర్గ ప్రజల సమస్యలపై దృష్టిపెడతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ఎంపీపీ సాకా జసింత, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ (రాము), నాయకులు చాపరాల దుర్గాప్రసాద్, గ్రామ సర్పంచులు పరసా వెంకయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.