కృష్ణ

1800 కి.మీ.లకు ప్రజా సంకల్పయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఏప్రిల్ 18: ప్రజాసంకల్ప యాత్ర పేరుతో మైలవరం నియోజకవర్గంలో మూడు రోజులుగా సాగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి పాదయాత్ర మైలవరం మండలంలో బుధవారం కూడా సాగింది. ఉదయం 9గంటల సమయంలో మైలవరం గ్రామ వెలుపల నుండి ప్రారంభమైన పాదయాత్ర మండలంలోని వెల్వడం, వెల్వడం అడ్డరోడ్ మీదుగా గణపవరం చేరుకుంది. అక్కడ బస చేసి భోజన విరామం ప్రకటించారు. ఉదయం మైలవరంలో బయలుదేరే సమయంలో ఆయనను చూడటానికి కార్యకర్తలు, అభిమానులు ఎగబడ్డారు. ఆయన వద్దకు చేరుకుని అనేక మంది సెల్ఫీలు దిగారు. అనంతరం పాదయాత్ర చేసుకుంటూ వెల్వడం గ్రామంలోకి చేరుకున్నారు. గ్రామస్తులు ఆయనకు ఎదురేగి భారీగా స్వాగతం పలుకుతూ కనకతప్పెట్లతో ఆయనను గ్రామంలో తిప్పారు. అందరినీ పలుకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ జనంతో మమేకమై వారితో కలిసి నడిచారు. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల ఆగడాలు, ప్రభుత్వ పనితీరును జగన్‌కు ఫిర్యాదు చేశారు. జగన్ వారిని ఓదారుస్తూ అందరూ ధైర్యంగా ఉండాలని మన ప్రభుత్వం వస్తుందని అందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. సెక్యూరిటీ అత్యుత్సాహం కారణంగా మహిళలు, యువకులు, వృద్ధులు జగన్ వద్దకు చేరుకోలేక ఆగ్రహంతో వారిని తిట్టుకుంటూ నిరాశతో వెనుదిరిగారు. మధ్యాహ్న సమయానికి గణపవరం చేరుకున్న జగన్ అక్కడ అతని మేనత్త ఇంటికి చేరుకుని అక్కడ బస చేశారు. ఈసందర్భంగా తన పాదయాత్ర ఇప్పటికి 1800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని గుర్తుగా అక్కడ ఒక మొక్కను నాటారు. సాయంత్రం సమయంలో తిరిగి పాదయాత్ర కొనసాగటానికి ముందు గ్రామంలోని ఎస్సీలతో కొద్దిసేపు ఇంటరాక్షన్ కొనసాగించారు. అనంతరం ఆయన పాదయాత్ర చేసుకుంటూ నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం ఈదర, శోభనాపురం గ్రామాలకు తరలివెళ్ళారు. జగన్ వెంట మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె పార్థసారధి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, జోగి రమేష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కాజా రాజ్ కుమార్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కృష్ణా వర్సిటీలో ‘కూచిపూడి’ డిప్లొమా కోర్సు
* కోర్సు ప్రవేశానికి విద్యార్హత పదవ తరగతే
* ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు
మచిలీపట్నం, ఏప్రిల్ 18: పదవ తరగతి విద్యార్హతతో కృష్ణా విశ్వవిద్యాలయంలో డిప్లొమా ఇన్ కూచిపూడి నాట్య సంగీతం కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య సుంకరి రామకృష్ణారావు తెలిపారు. 2018-19 విద్యా సంవత్సరంలో ప్రవేశ పెట్టబోయే ఈ కోర్సుకు సంబంధించిన గోడపత్రికలను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ ఏడాది కాల పరిమితి గల ఈ కోర్సు ప్రవేశానికి పదవ తరగతి విద్యార్హతతో పాటు శాస్ర్తియ ప్రాచీన సంగీతంలో అనుభవం కలిగి ఉండాలన్నారు. నాట్య సంగీతంలో ఉపయోగించే వివిధ రకాలైన వాయిద్యాలలో కలసిన కోర్సులను వారి అభిరుచి, ఆసక్తిని బట్టి వోకల్ - వయోలిన్ - వీణ, ఫ్లూట్ తదితర కోర్సుల్లో విడివిడిగా డిప్లమో పొందవచ్చని తెలిపారు. కెఆర్‌యు సెట్ - 2018 కన్వీనర్‌గా రసాయన శాస్త్ర విభాగాధిపతి డా. డి రామశేఖరరెడ్డి, సహాయ కన్వీనర్‌గా ఆంగ్ల విభాగానికి చెందిన ఆచార్యులు డా. ఇ భవానికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ కోర్సుకు సంబంధించిన విధి విధానాలు, సిలబస్, ఇతర అంశాలను ఇప్పటికే రూపొందించామన్నారు. పీజీ డిప్లమో, డిప్లమో, సర్ట్ఫికేట్ కోర్సులందు విద్యార్థుల మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్లు పకులపతి సుంకరి రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పులిపాటి కింగ్, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ వైకె సుందర కృష్ణ, అడ్మిషన్స్ సంచాలకులు డా. డి రామశేఖరరెడ్డి, సహ సంచాలకులు డా. భవాని, ఆఫీసర్ కె సీతాలు తదితరులు పాల్గొన్నారు.