కృష్ణ

సీఎం ధర్మపోరాట దీక్ష విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 18: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే ధర్మపోరాట దీక్షకు ప్రజలంతా సంఘీభావం తెలపాలని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియం వేదికగా 20వ తేదీ ఉదయం 7గంటల నుండి రాత్రి 7గంటల వరకు జరిగే ధర్మపోరాట దీక్షలో ప్రజలంతా స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దీక్షకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం నిరశన దీక్ష అనంతరం 21వ తేదీ నుండి 28వతేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించి విభజన హామీలు అమలు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. గత ఎన్నికల్లో తిరుమల తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలను గుర్తు చేసే విధంగా ఈ నెల 29, 30తేదీల్లో అదే ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించి కేంద్రం మోసపూరిత విధానాలను ఎండగడతామన్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ప్రత్యేక హోదా సాధనకు కలిసి వచ్చే అన్ని పక్షాల నాయకులు, ఎన్‌జీఓలు పాల్గొనున్నట్లు ఎమ్మెల్సీ అర్జునుడు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కౌన్సిలర్ బత్తిన దాస్, ఎంఆర్‌పీఎస్ నాయకుడు మాచవరపు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

చింతమనేనిపై చర్యకురెండోరోజూ ఆందోళనలు
హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 18: ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం అర్ధరాత్రి వరకు ఆందోళన చేసిన వివిధ పక్షాల నాయకులు బుధవారం కూడా కొనసాగించారు. సామాన్యుడిపై, ఆర్టీసీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ, కాంగ్రెస్, కాపు సంఘాల నాయకులు జంక్షన్ కూడలిలో దాదాపు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. దాడి చేసి పిరికిపందలా పారిపోయిన చింతమనేనికి దమ్ము, ధైర్యం వుంటే జంక్షన్ కూడలికి రావాలని సవాల్ విసిరిన జిల్లా కాంగ్రెస్ నాయకులు, కాపు నేత చలమలశెట్టి రమేష్‌బాబు తన అనుచరులతో ఆందోళన చేశారు. చింతమనేని రాకకోసం రెండు గంటలపాటు ఎదురుచూసిన ఆయన అనుచరులు, పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆందోళనను విరమించారు. ఈ ఆందోళనకు మద్దతుగా వైసీపీ రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, దెందులూరు వైసీపీ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆందోళనతో హనుమాన్‌జంక్షన్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా హనుమాన్‌జంక్షన్ సిఐ వైవివిఎల్ నాయుడు, ఎస్‌ఐ సతీష్ తమ సిబ్బందితో ఏర్పాట్లు చేశారు.

ఆర్టీసీ సిబ్బంది ఫిర్యాదు
విధి నిర్వహణలో వున్న తమను ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అడ్డుకోవడంతో పాటు దూషించినట్లు ఆర్టీసీ సిబ్బంది ఫిర్యాదు చేసినట్లు హనుమాన్‌జంక్షన్ సిఐ వైవివిఎల్ నాయుడు తెలిపారు. మంగళవారం రాత్రి బాధితుడు గరికపాటి నాగేశ్వరరావు ఫిర్యాదు ఇచ్చారని, ఆర్టీసీ సిబ్బంది బుధవారం ఫిర్యాదు చేశారని వివరించారు. రెండు ఫిర్యాదులు నేరపూరిత అంశాలు కాకపోవడంతో కేసు నమోదు, తదుపరి చర్యల కోసం కోర్టుకు లేఖ రాస్తామని సీఐ వెల్లడించారు. మంగళవారం రాత్రి పెడన - విసన్నపేట రాష్ట్ర రహదారిపై రాస్తారాకో చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు జంక్షన్ ఎస్‌ఐ సతీష్ తెలిపారు.