కృష్ణ

ఆక్రోశించిన ‘ఆశ’ కార్యకర్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 18: సమస్యల సాధన కొరకు కలెక్టరేట్ ఎదుట ఆశ కార్యకర్తలు చేపట్టిన 48గంటల నిరశన దీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. గత కనీస వేతనం ఇవ్వాలని, పారితోషికాలకు స్వస్తి చెప్పాలని, బకాయి పడ్డ వేతనాలను తక్షణమే విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఆశ కార్యకర్తలు చేపట్టిన నిరశన దీక్ష బుధవారం ఉద్రిక్తతకు దారి తీసింది. దీక్షలో పాల్గొన్న వందలాది మంది ఆశ కార్యకర్తలు కలెక్టరేట్‌ను ముట్టడిస్తారన్న సమాచారంతో బందరు డీఎస్పీ యండి మహబూబ్ బాషా నేతృత్వంలో భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. భారీగా మోహరించిన పోలీసులు దీక్షాపరులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఆశ కార్యకర్తలు పోలీసులకు సవాల్ విసురుతూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. అయితే రోప్‌పార్టీ సాయంతో పోలీసులు ఆందోళనకారులను కలెక్టరేట్ గేటును కూడా తాకనివ్వలేదు. ముఖ్యమైన ఉద్యమకారులను అదుపులోకి తీసునే సమయంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో చాలా మంది ఆశ కార్యకర్తలు, పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆశ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఒకానొక దశలో కలెక్టరేట్ ఎదుట ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అదుపులోకి తీసుకున్న ఉద్యమకారులను పోలీసుల వాహనాల్లోకి ఎక్కించగా వాటిని ఎటూ కదలనివ్వకుండా వాహనాల ముందు పడుకుని మరీ నిరసన తెలియచేశారు. ఈ క్రమంలో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. చెల్లాచెదురైనప్పటికీ ఆందోళనకారులు మళ్లీ ఒక్కటై పోలీసులపై తిరగబడ్డారు. 35 మంది నేతలను అరెస్టు చేసిన పోలీసులు వారిని ఇనగుదురు, చిలకలపూడి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలంటూ చిలకలపూడి పోలీసు స్టేషన్ ఎదుట కూడా ఆశ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. చివరికి అరెస్టు చేసిన వారిని వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేయటంతో ఆశ కార్యకర్తలు శాంతించారు. వీరి ఆందోళనకు ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ కమల, జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ పరుచూరి ధనశ్రీ, జిల్లా మహిళా సంఘం నాయకురాలు వి జ్యోతి, సీఐటీయు తూర్పు కృష్ణా అధ్యక్షుడు చౌటపల్లి రవి, కెవీపీఎస్ జిల్లా కార్యదర్శి సాల్మన్‌రాజు, భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి కంచర్లపల్లి వేణుగోపాలరావు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి నాగభూషణం తదితరులు నాయకత్వం వహించారు.