కృష్ణ

అరటి రైతుల పంట పండింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఏప్రిల్ 19: గతేడాది నష్టాల పాలుజేసిన అరటి ఈ ఏడాది సిరులు కురిపిస్తోంది. లాభాలు రావటంతో రైతుల అప్పుల ఊబినుంచి గట్టేక్కుతున్నారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో ధర ఆశాజనకంగా ఉండి లాభాలు వస్తున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం అరటి గెల రూ.40 నుంచి రూ.50లకు విక్రయించగా ఇపుడు రూ.200 నుంచి రూ.250 వరకు అమ్ముడవుతోందని రైతులు చెపుతున్నారు. మండలంలో రైతులు ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో అరటిని సాగు చేశారు. మాగాణిలో మెట్ట పొలాలు, లంకల్లోను అరటి సాగు చేపట్టారు. కంద, పసుపు, బొప్పాయి, పెండలం తదితర పంటల్లో అరటిని అంతర్ పంటగా కూడా సాగు చేశారు. కర్పూర, చక్కెరకేళీ రకాలను అధికంగా సాగుచేయగా అమృతపాణి తక్కువగా సాగుచేశారు. ఎకరానికి రూ.30వేల నుంచి రూ.40వేల వరకు సాగు ఖర్చులయ్యాయని, ఒక ఎకరంలో కర్పూరం రకం వెయ్యి మొక్కలు, చక్కెరకేళీ సుమారు 1200 మొక్కలు నాటుతామని చెప్పారు. కర్పూరం రకం మూడు, నాలుగు దఫాలు పంట ఇస్తుందని, చక్కెరకెళీ రెండేళ్ళు పంట ఇస్తుందని రైతులు తెలిపారు. కర్పూరం గెల ఒక్కోసారి రూ.250 నుంచి రూ.300 వరకు వేలం పలుకుతోందని, చక్కెరకేళీ కాయసైజుని బట్టి రూ.70 నుంచి రూ.150, రూ.200 వరకు ధర పలుకుతోందని చెప్పారు. ఎకరానికి తేలిగ్గా రూ.40వేల సాగుఖర్చులు తీసినా రూ.1.5 లక్షల లాభం చేతికి వస్తున్నాయని రైతులు చెపుతున్నారు.

కుట్రలెన్ని చేసినా ధర్మపోరాటానికిజనం దన్ను
మంత్రి దేవినేని ఉమ స్పష్టీకరణ
మైలవరం, ఏప్రిల్ 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20న తన పుట్టిన సందర్భంగా ఒక రోజు నిరాహారదీక్ష చేస్తున్న ధర్మ పోరాటానికి రాష్ట్రంలోని ఐదు కోట్ల ఆంధ్రుల మద్దతు సంపూర్ణంగా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగిన మైలవరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి ఉమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేస్తుంటే దీనిని జగన్ విమర్శించటం హాస్యాస్పదమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని 18 అంశాలను నెరవేర్చే వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో కేంద్రంపై పోరాటం చేస్తుంటే ప్రజలు హర్షిస్తున్నారని, కానీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం దీక్షను తప్పుగా అభివర్ణించటం చూస్తుంటే ఐదుకోట్ల ఆంధ్రుల కోర్కెను అవమానిస్తున్నట్లేనని పేర్కొన్నారు. సమావేశంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సర్దార్ గౌతు లచ్చన్న నేటి యువతకు ఆదర్శం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 19: సర్దార్ గౌతు లచ్చన్న నేటి యువతకు ఆదర్శమని బందరు పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న 12వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక బస్టాండు సెంటరులోని లచ్చన్న విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ లచ్చన్న స్వాతంత్రోద్యమంలో గాంధీజీ భావాలతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటానికి నడుంబిగించి క్వింట్ ఇండియా ఉద్యమంలో ఆంగ్లేయులచే ప్రమాదకరమైన వ్యక్తిగా పేరుపొందారన్నారు. తొలుత ఎంపీ నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబాప్రసాద్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనకళ్ల జగన్మోహనరావు తదితరులు గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు నారగాని ఆంజనేయ ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ చిలంకుర్తి తాతయ్య పాల్గొన్నారు.