కృష్ణ

కలెక్టర్ లక్ష్మీకాంతం, డా. శ్రీ్ధర్‌రెడ్డిలకు రెడ్‌క్రాస్ సేవా పురస్కారాల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా అందించిన సేవలకు గుర్తింపుగా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం, ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ్ధర్‌రెడ్డిలకు శనివారం బంగారు పతకాన్ని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అందజేశారు. విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్స్ థియేటల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ రాష్ట్రంలో రెడ్‌క్రాస్ సొసైటీకి సేవలందించిన అధికారులకు, స్వచ్ఛంద సేవకులకు పతకాలు, సేవా అవార్డులను అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ సేవే పరమావధిగా ప్రజలకు సేవలందిస్తున్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి కృష్ణా జిల్లా నుండి కోటి రూ పాయలు సభ్యత్వ విరాళాలుగా సేకరించి అందించామని తెలిపారు. ఈ విషయంలో జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా నుం డి రెడ్‌క్రాస్ అవార్డులు అందుకున్న వారిలో నూజివీడు ఆర్డీవో సీహెచ్ రంగయ్య, జగ్గయ్యపేట తహశీల్దార్ చంద్రశేఖర్, గన్నవరం తహశీల్దార్ ఎం మాధురి, డాక్టర్ అచ్చెయ్ కుమార్, టీవీ హనుమంతరావు, తదితరులు ఉన్నారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ గౌరవాధ్యక్షురాలు రేచల్ చటర్జీ, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిప్రీత్ సింగ్, జనరల్ సెక్రటరీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రులను దగా చేసిన కేంద్రం
పటమట, ఏప్రిల్ 21: ఆంధ్రులను కేంద్ర ప్రభుత్వం దగా చేసిందని, ప్ర త్యేక హోదా ఇవ్వకుండా 5కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలతో ఆడుకుంటు న్న కేంద్రం ఆటలు ఇక చెల్లవని శాసభసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు శనివారం చేపట్టిన సైకిల్ యాత్రను పటమటలోని 10వ డివిజన్‌లో నిర్వహించారు. ఈ యాత్రను గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం 5కోట్ల ఆంధ్రులకు చేసిన నమ్మక ద్రోహానికి, కుట్ర రా జకీయాలకు నిరసనగా, వ్యతిరేకంగా ప్రజా పోరాటాం చేయాలన్న ఉద్దేశం తో చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజలను చైతన్యం చేసే దిశగా ఈ సైకిల్ యాత్రను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మన పి ల్లల భవిష్యత్ కోసం కేంద్రంపై శంఖం పూరించిన చంద్రబాబుకు అన్ని విధాలుగా మన అందరం అండగా నిలబడాలని కోరారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. హోదా 5 కాదు 10 ఏళ్లు ఇవ్వాలని నాడు సాక్షాత్తూ బీజేపీ నాయకులే కోరారని గద్దె గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా సాధించటం ఎప్పటికైనా చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. శుక్రవారం సీఎం చేపట్టిన దీక్ష విజయవంతం అవ్వటమే ప్రత్యేక హోదా సాధనకు నాంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పొట్లూరి సాయిబాబు, మండవ రాంబాబు, మాగంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.