కృష్ణ

కాంపిటెంట్ అధికారులతో సమావేశమైన కమిషనర్ శ్రీ్ధర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 21: రాజధాని రహదారుల రోడ్ల నిర్మాణాలకు సంబంధించి మిగిలి ఉన్న భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ఆదేశించారు. రాజధాని నగర ప్రాంతంలో భూసేకరణలో భాగంగా అవసరం ఉన్న 21 ఎకరాలకు అవార్డుకు వచ్చే వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని కాంపిటెంట్ అధికారులకు సూచించారు. శనివారం నగరంలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌తో కలిసి సమీక్షించారు. భూసేకరణకు ఇచ్చే పరిహారంగా రూ.100 కోట్లు సీఆర్‌డీఏ అందుబాటులో ఉంచుతుందన్నారు. ఉద్యానవన శాఖ, అటవీశాఖ, రహదారులు, భవనాల శాఖల నుంచి తోటలు, ఇళ్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన అంచనాలను సత్వరమే రప్పించాలని తెలిపారు. ఇళ్లు స్థలాలు రహదారుల నిర్మాణంలో కోల్పోన్న వారికి రాయపూడి, నవులూరు తదితర ప్రాంతాల్లో పునరావాస కాలనీలను చూపించి సంప్రదింపుల ఒప్పంద విధానంలో ప్రయోజనాలను వివరించాలని, రహదారుల నిర్మాణంలో ఉన్న అవరోధాలన్నీ త్వరగా పరిష్కరించాలని సూచించారు. సంప్రదింపుల ఒప్పంద ప్రయోజనాలు, రైతులకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించేందుకు సీఆర్‌డీఏ నిధుల నుంచి తక్షణమే రూ.25కోట్ల మేర నిధులు గుంటూరు జాయింట్ కలెక్టర్‌కు విడుదల చేయాలని అకౌంట్స్ డైరెక్టర్‌ను శ్రీ్ధర్ ఆదేశించారు. ఇప్పటివరకూ ల్యాండ్ పూలింగ్ సమీకరణలో భూమిని గ్రామాల వారీగా ఆయా కాంపిటెంట్ అధికార్లు రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్లను వారికి రిజిస్టర్ చేయించే చర్యలను సత్వరమే పూర్తి చేయాలన్నారు. అదే సమయంలో ఆయా గ్రామాల్లో సీఆర్‌డీఏ రోడ్డు పార్కులు వంటి వౌలిక సదుపాయాలకు కేటాయించిన భూమిని కొ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా సీఆర్‌డీఏకు అప్పగించాలని సూచించారు. ఇందుకు జీఐఎస్ టీమ్ గ్రామాల వారీగా ప్రత్యేక మ్యాప్‌లు రూపొందించి కాంపిటెంట్ అధికారులకు అందజేస్తామన్నారు. ఇప్పటివరకూ 14వేల 449 ప్లాట్లను రైతులకు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని, మిగిలిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా వేగవంతం చేయాలన్నారు. అలాగే 1670 ప్లాట్లను రైతుల నుంచి ఇతరులు కొనుగోలు చేయించడం జరిగిందని అధికారులు కమిషనర్ శ్రీ్ధర్‌కు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో డైరెక్టర్ ఎస్టేట్స్ మోహనరావు డైరెక్టర్ ల్యాండ్స్ బీఎల్ చెన్నకేశవరావు, ఏడీసీ డైరెక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆరుతడి పంటలపై స్పష్టత ఇవ్వాలి
అవనిగడ్డ, ఏప్రిల్ 21: ఆరుతడి పంటల విషయంలో ఈ సంవత్సరమైనా వ్యవసాయశాఖ అధికారులు సరైన సమాచారం ఇవ్వాలని శనివారం అవనిగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో సభ్యులు డిమాండ్ చేశారు. గత సంవత్సరం ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పిన అధికారులు మంచినీరు సరఫరా చేయలేకపోయారని, ఆందోళన చేస్తే గానీ మంచినీరు విడుదల చేయలేదని గుర్తు చేశారు. తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఆరుతడి పంటలకు సంబంధించి రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు. మినుముల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సమావేశంలో కోరారు. ఈ విషయమై రైతులను ఇబ్బంది పెడుతున్న వ్యవసాయశాఖ అధికారిణిపై ఎంపీటీసీ సభ్యుడు గాజుల మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న వేసవి దృష్ట్యా అన్ని గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కనకదుర్గ, జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ సునీతాశర్మ తదితరులు పాల్గొన్నారు.