కృష్ణ

చిత్తశుద్ధితో హామీలు నెరవేరుస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 21: గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. మండల పరిధిలోని పోతేపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లల్లో బందరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రధాన రహదార్లు విస్తరణతో పాటు అంతర్గత రహదారులను సీసీ రోడ్లతో అభివృద్ధిపర్చామన్నారు. పోతేపల్లి జ్యుయలరీ పార్కులో మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.50లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. మండల పరిధిలో ఇప్పటి వరకు 26కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. గ్రామ సర్పంచ్ శ్రీపతి గంగాభవాని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య) తదితరులు పాల్గొన్నారు.

కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు
మైలవరం, ఏప్రిల్ 21: హోటళ్ళు, కిరణా దుకాణాలలో కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ కెవి శివయ్య హెచ్చరించారు. మండల ఆహార సలహా సంఘం సమావేశం శనివారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా పలువురు సభ్యులు కల్తీ వంట నూనెలు, కల్తీ మాంసం, కల్తీ నిత్యావసర సరుకులు విక్రయాలు జరుగుతున్నాయని వాటిపై దాడులు చేయాలని సూచించగా ఆయన స్పందించారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఫుట్ సేఫ్టీ అధికారులను పిలిపించి దాడులు నిర్వహించటం జరుగుతుందన్నారు. అదేవిధంగా కల్తీ మాంసం విక్రయాలపై కూడా నిఘా పెట్టి దాడులు నిర్వహించటం జరుగుతుందన్నారు. పెట్రోల్ బంకుల్లో తూనికలు, కొలతలలో తేడాలుంటున్నాయి వాటిపై కూడా నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహించటం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రజాసాధికార సర్వే ద్వారా గతంలో నమోదు చేయించుకోని వారు వెంటనే నమోదు చేయించుకోవాలన్నారు. లేని పక్షంలో వారికి ప్రభుత్వ పధకాలు వర్తించవన్నారు. చంద్రన్న విలేజ్ మాల్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసమావేశంలో మండలంలోని రేషన్ డీలర్లతోపాటు ఆహార సలహా సంఘ సభ్యులు, ఆర్‌ఐ, డిటి, వీఆర్వోలు పాల్గొన్నారు.

మంజూరైన స్థలాలు అప్పగించేదెప్పుడు?
కూచిపూడి, ఏప్రిల్ 21: మొవ్వ మండలంలోని మొవ్వ, పెదపూడి గ్రామాల్లో దశాబ్దం కాలం కిందట పేదలకు ఇచ్చిన నివేశన స్థలాలు స్వాధీనపర్చటంలో రెవెన్యూ అధికారులు కనబరుస్తున్న సాచివేత ధోరణికి నిరసనగా ఈ నెల 24వ తేదీ నుండి సీపీఎం ఆధ్వర్యంలో నిరవధిక ఆందోళన చేపడుతున్నట్లు ఆ పార్టీ తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్ రఘు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మొవ్వ గ్రామంలోని సర్వే నెం. 284/1లో 49 మంది పేదలకు 2010 డిసెంబర్ 23వ తేదీన నివేశన స్థలాలు పంపిణీ చేశారని, సర్వే నెంబర్ 416/2008లో 107 మంది పేదపూడి పేదలకు నివేశన స్థలాలు పంపిణీ చేసినా న్యాయస్థానం జోక్యంతో నిలిచిపోయిన, తిరిగి రెవెన్యూ అధికారులకే న్యాయస్థానాలు పంపిణీ అధికారం ఇచ్చినా నివేశన స్థలాల పంపిణీలో అధికారులు కనబరుస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 24వ తేదీన ఆందోళన చేపడుతున్నట్లు రఘు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ కార్యదర్శి శీలం ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.