కృష్ణ

‘ప్రజాదివస్’ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 23: ప్రజాదివస్ ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎస్పీ త్రిపాఠికి విన్నవించుకున్నారు. సంబంధిత సమస్యలపై ఎస్పీ త్రిపాఠి ఆయా పోలీసు స్టేషన్ అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పురోగతిని ఎప్పటికప్పుడు బాధితులకు తెలియచేయాలన్నారు. సమస్య తీవ్రతను బట్టి కేసులు నమోదు చేసి ముద్దాయిలను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

నిర్ణీత సమయంలో ‘మీకోసం’ అర్జీలను పరిష్కరించండి
* జెసీ విజయకృష్ణన్
మచిలీపట్నం, ఏప్రిల్ 23: నిర్ణీత సమయంలో ‘మీకోసం’ అర్జీలను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జెసీ విజయకృష్ణన్ మాట్లాడుతూ మీకోసంలో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం తగదన్నారు. నిర్ణీత సమయంలో అర్జీలను పరిష్కరించాలన్నారు. ఒకటికి పదిసార్లు అర్జీదారులను తిప్పవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరాజు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. పద్మజారాణి, మత్స్య శాఖ జెడీ యాకూబ్ బాషా, ఎస్సీ కార్పొరేషన్ ఇడీ ఎన్‌వివి సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఇడీ జి పెంటోజీరావు, సాంఘీక సంక్షేమ శాఖ జెడీ పిఎస్‌ఎ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం అవలంభిస్తున్న విధానాలను తిప్పి కొట్టాలి
* సైకిల్ యాత్రలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 23: విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సైకిల్ యాత్రలో భాగంగా మూడవ రోజైన సోమవారం మండల పరిధిలోని తాళ్లపాలెం, పెదపట్నం గ్రామాల్లో పర్యటించారు. కేంద్రం అవలంభిస్తున్న విధానాలను ఆయా గ్రామస్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు కుంచే దుర్గా ప్రసాద్(నాని) తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 23: అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెని ఆస్తులను జి గ్రూపుకు చెందిన ఎస్‌ఎల్ కంపెనీ ఎనిమిది నెలల అనంతరం ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి దుర్భుద్దితో తప్పుకుందన్నారు. ఏ రోజుకారోజు ప్రతిక్షణం దిగులుతో బ్రతుకుతున్న బాధితులు మరోసారి వీధులలోకి వచ్చే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె గగన్, యండి షఫీ ఉల్లా, ఎన్ ఈశ్వర్, రామాంజనేయులు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జంపన వెంకటేశ్వరరావు, సీపీఐ సహాయ కార్యదర్శి యర్రంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు