కృష్ణ

మడ చెట్ల నరికివేతదారులపై కఠినంగా వ్యవహరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 16: ప్రకృతి వైపరీత్యాలకు అస్కారం కలిగించే విధంగా మడ చెట్లను నరికి వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ట్రైనీ కలెక్టర్ కాజావలీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బందరు మండలం పెదపట్నం గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న మడ చెట్ల నరికి వేతపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఆయన పరిశీలించారు. పెదపట్నం గ్రామంలోని మడ చెట్లను పరిశీలించిన ఆయన రెవెన్యూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మడ చెట్లు నరికి చేపల చెరువులుగా మారుస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. తీర గ్రామాలపై రెవెన్యూ అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. చెరువు అక్రమ తవ్వకందారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట తహశీల్దార్ బి నారదముని, సర్వేయర్ రాజబాబు తదితరులు ఉన్నారు.

బొడ్డపాడులో భారీ దొంగతనం
* డబ్బులు,బంగారం, వెండి అపహరణ
తోట్లవల్లూరు, మే 16: మండలంలోని బొడ్డపాడులో భారీ దొంగతనం జరిగింది. తాళం వేసివున్న మాజీ పీఏసీఏస్ అధ్యక్షుడు నిమ్మగడ్డ శివరామకృష్ణ ఇంటిలో మంగళవారం అర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడి రూ.3లక్షల నగదు, 14 కాసుల బంగారం నగలు, 2.5 కేజీల వెండి వస్తువులను అపహరించారు. బుధవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శివరామకృష్ణ దంపతులు మూడు రోజుల క్రితం భీమవరంలోని కూతురు ఇంటికి వెళ్ళారు. పై అంతస్తులో అత్తామామ ఉన్నారు. కింద ఇంటికి తాళం వేసి వెళ్ళారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు శివరామకృష్ణ మామ యార్లగడ్డ భాస్కరరావు పూజకు పూలు కోసేందుకు కిందకి దిగారు. పూలు కోస్తుండగా ప్రహరీపై ఇనుప డిజైన్ డ్రిల్ విరిగిపడి ఉండటాన్ని గమనించాడు. ఇదేంటి ఎలా విరిగిందని అనుమానం వచ్చి ప్రధాన ద్వారం తాళాన్ని చూశారు. గొళ్ళెం కోసి ఉండటాన్ని గమనించి చుట్టుప్రక్కల వారిని పిలిచి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఏసీపీ విజయభాస్కర్, సీఐ పి సత్యానందం, ఎస్‌ఐ టి మురళీ, సీసీఎస్ సీఐ వినయ్‌కుమార్, ఎస్‌ఐ జనార్థన్ పోలీసులు సిబ్బంది వచ్చి చోరీ వివరాలను పరిశీలించారు. భీమవరం నుంచి శివరామకృష్ణ దంపతులు చేరుకున్నారు. శివరామకృష్ణ ఇంటి ఆవరణలో ఉన్న పలుగు, లోపల ఉన్న కత్తిని ఉపయోగించి బీరువా, అలమరాల తలుపులను దొంగలు పగులకొట్టారు. పలుగు, కత్తిని బైడ్‌పైనే పడవేశారు. రూ.3లక్షల నగదు, 14 కాసుల బంగారు నగలు, 2.5 కేజీల వెండి వస్తువులు పోయినట్టు శివరామకృష్ణ పోలీసులకు తెలిపారు. క్లూస్‌టీం వచ్చి వేలిముద్రలను సేకరించింది. దొంగలు ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణం వైపు ద్వారం నుంచి బయటకు వెళ్ళారు. శివరామకృష్ణ నుంచి ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బొడ్డపాడులో సంచలనం కలిగించింది.