కృష్ణ

నేటి నుండి పాలిసెట్ సర్ట్ఫికెట్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 16: పాలిటెక్నిక్‌లో అడ్మిషన్లకై నేటినుండి సర్ట్ఫికెట్ల పరిశీలన చేయనున్నారు. ఈనెల 20నుండి ఆన్‌లైన్‌లో కళాశాలల ఆప్షన్ పెట్టుకోవాలి. 17న 1వర్యాంక్ నుండి 12,000 ర్యాంక్ వరకు, 18న 12001 నుండి 25000 ర్యాంక్ వరకు, 19న 25001 నుండి 38000 ర్యాంక్ వరకు, 20న 38001 నుండి 52000 ర్యాంక్ వరకు, 21న 52001 నుండి 67000 ర్యాంక్ వరకు, 22న 67001 నుండి 84000 ర్యాంక్ వరకు, 23న 84001 నుండి చివరి ర్యాంక్ వరకు సర్ట్ఫికెట్ల పరిశీలన జరగనుంది. కళాశాలలో ప్రవేశానికి ఆన్‌లైన్ ఆప్షన్స్‌ను 20, 21తేదీల్లో 1ర్యాంక్ నుండి 30000 ర్యాంక్ వరకు, 22, 23తేదీల్లో 30001 నుండి 60000 ర్యాంక్ వరకు 24, 25తేదీల్లో 60001 నుండి చివరి ర్యాంక్ వరకు ఆప్షన్స్‌ను నమోదు చేసుకోవాలి. 26న ఆప్షన్స్ మార్చుకునేందుకు 1ర్యాంక్ నుండి చివరి ర్యాంక్ వరకు అవకాశం కలదు. 28న కళాశాలల ఎలాట్‌మెంట్ జరుగుతుంది. సర్ట్ఫికెట్ల పరిశీలనకు వచ్చే 10వ తరగతి మార్కుల లిస్టు, ఆధార్‌కార్డ్, నాల్గవ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్ట్ఫికెట్, ఇన్‌కాం సర్ట్ఫికెట్ లేదా తెల్ల రేషన్‌కార్డు, కుల ధ్రువీకరణ సర్ట్ఫికెట్‌లతో రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి. స్పెషల్ కేటగిరిలో 17న ఆంగ్లో ఇండియన్, ఫిజికల్లి హ్యండీకాప్డ్ (పీహెచ్) మరియు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీడ్ పర్సనల్ (సిఎపీ) వారికి 1నుండి చివరి ర్యాంక్ వరకు, 18న ఎన్‌సీసీ 1నుండి 40000 ర్యాంక్ వరకు, 19న స్పోర్ట్స్ 1నుండి 30000 ర్యాంక్ వరకు, 20న ఎన్‌సీసీ 40001 నుండి చివరి ర్యాంక్ వరకు, 21న స్పోర్ట్స్ 30001 నుండి 65000 ర్యాంక్ వరకు, 22న స్పోర్ట్స్ 65001 నుండి చివరి ర్యాంక్ వరకు సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగుతుంది. నగరంలో ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్ర లాయోల కళాశాలల్లో హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటాలో 29 క్రీడాంశాలు ఉన్నాయి. అవి ఈవిధంగా ఉన్నాయి. ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, ఖోఖో, రోలర్ స్కేటింగ్, రోయింగ్, సైలింగ్ అండ్ యాచింగ్, షూటింగ్, షటిల్ బ్యాడ్మింటన్, సాఫ్ట్‌బాల్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బాల్‌బాడ్మింటన్.

దోపీడీ ముఠా అరెస్ట్
* మోటారు వాహనాలు, నగదు స్వాధీనం
బెంజిసర్కిల్, మే 16: రాత్రి సమయాల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లేవారిని అడ్డగించి వారిని బెదిరించి, కొట్టి వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్‌లను దోపిడీ చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో మోటారు వాహనాలను దొంగతనం చేస్తున్న నిందితులను నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఆదేశాలతో వివిధ నేరాల నియంత్రణ, పాత నేరస్థుల కదలికపై పటిష్ఠమైన నిఘాను ఏర్పాటు చేయడం, పోలీసు గస్తీని ముమ్మరం చేయడంతో నిందితులు పోలీసులకు చిక్కారు. ఈ పరిస్థితుల్లో జైలు నుండి విడుదలైన నేరస్థులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు మరియు పాత నేరస్థులు పోలీసులకు చిక్కారు. విజయవాడ సీసీఎస్ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో బుధవారం నగరంలోని కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ పార్కు సమీపంలో జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కే సాయికృష్ణ, భవానీపురం శివాలయం వీధికి చెందిన ఎండీ ఆరీఫ్‌ను పోలీసులకు వల వేసి పట్టుకున్నారు. అలాగే టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిల్క్ ప్రాజెక్టు సమీపంలో పాత నేరస్థుడు గాదె రాజేష్, టీ రామకృష్ణ అలియాస్ బాబు, ఇర్ల నాగరాజు అలియాస్ నాగిలను పొలీసులు పట్టుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాతి థియేటర్ సమీపంలో సంతోష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పండిట్ నెహ్రూహ్రు బస్టాండ్ పరిధిలో అంకుళ్ల శ్రీనివాసరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురి నిందితుల నుండి 3 ఆటోలు, 3 సెల్‌ఫోన్‌లు, 4 మోటారు సైకిళ్లు, రూ.1500ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్ర ప్రజలను వంచించిన బాబు
* రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు
* వంచనపై ప్రజాగర్జనలో వైకాపా నేతల విమర్శ
బెంజిసర్కిల్, మే 16: అధికారంలోకి వచ్చిన నాటి నుండి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నిలువునా వంచించి పాలన సాగిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. అవసరం లేకపోయిన పెద్ద ఎత్తున అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో వైకాపా శ్రేణులు వంచనపై ప్రజాగర్జన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు నగరంలోని బందర్‌రోడ్డులోని వైకాపా రాష్ట్ర కార్యాలయం నుండి ర్యాలీగా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వరకు వెళ్లారు. వైకాపా నేతలు కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు కలెక్టర్ లక్ష్మీకాంతంను కలిసి చంద్రబాబు ప్రభుత్వ అవినీతి అక్రమాలు, దోపిడీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ నాలుగేళ్లలో అమలు చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలం చెందారని తెలిపారు. హామీలు అమలు చేయకపోగా ప్రజాధనాన్ని దోచుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రాజధాని భూముల దగ్గర మొదలు అసెంబ్లీ, సచివాలయ నిర్మాణం, పోలవరం, పట్టిసీమ వంటి వాటిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. కొన్నింటిపై కాగ్ కూడా తప్పు పట్టిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఈ వ్యవహారాలపై అత్యున్నత దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ప్రజల భవిష్యత్తునే ఫణంగా పెట్టారని విమర్శించారు. వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్, తిరుపూరు ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవి, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ, మైలవరం, పెడన, కైకలూరు, పామర్రు, మచిలీపట్నం సమన్వయకర్తలు వసంత కృష్ణప్రసాద్, ఉప్పాల రాంప్రసాద్, జోగి రమేష్, సింహాద్రి రమేష్, డి నాగేశ్వరరావు, కైలే అనిల్ కుమార్, పేర్ని నానితో పాటు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.