కృష్ణ

18న జరిగే మినీ మహానాడును జయప్రదం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: ఈనెల 18న మైలవరం శ్రీ సాయిబాబా కల్యాణ మండపంలో జరిగే మినీ మహానాడును జయప్రదం చేయాలని మైలవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాతా పోతురాజు కోరారు. మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం మండలంలోని చండ్రగూడెం శివాలయం ఆవరణలో జరిగింది. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈమినీ మహానాడు కార్యక్రమానికి కార్యకర్తలు, నేతలు హాజరై జయప్రదం చేయాలన్నారు. ఉదయం పది గంటల నుండి సాయంత్రం 4గంటల వరకూ జరుగుతుందని అనంతరం మైలవరం పట్టణంలో ప్రత్యేక హోదాపై సైకిల్ యాత్ర జరుగుతుందని, తర్వాత బోసుబొమ్మ సెంటర్‌లో బహిరంగ సభ జరుగుతుందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోమటి సుధాకర్ మాట్లాడుతూ గడచిన నాలుగేళ్ళలో నియోజకవర్గంలో మంత్రి ఉమ ఆధ్వర్యంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. అన్ని గ్రామాలలో వౌలిక సదుపాయాలు కల్పించటం జరుగిందన్నారు. సిసి రోడ్లు 80 శాతం పూర్తయ్యాయని మిగిలిన 20 శాతం రోడ్లు కూడా త్వరలోనే వేయటం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో వైసీపీ కొందరు నేతలు సాగునీరు రాలేదని, పంటలు ఎండిపోతున్నాయని బోర్ల కింద వరి పంటను చూపి రాజకీయ లబ్ది పొందటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సాగునీరు రాని పరిస్థితులలో సైతం మంత్రి ఉమ చొరవతోనే సాగు నీరు వచ్చాయని, చెరువులను నింపి పంటలకు కూడా పెట్టుకున్న విషయాన్ని విపక్షాలు గుర్తించాలన్నారు. అదేవిధంగా వివిధ కార్పోరేషన్‌లకు సంబంధించిన రుణాలను సంబంధించిన కులాల లబ్దిదారులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇప్పటికే కాపు కార్పోరేషన్ రుణాలతోపాటు ఉపాధి పధకాలు కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్పొరేషన్‌లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు సుబ్బారావు, కుమార్‌రెడ్డి, ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ రాము, లీలాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కోడూరు నుండి అవనిగడ్డ వరకు వైసీపీ పాదయాత్ర
అవనిగడ్డ, మే 16: అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావల్సిన అవసరం ఉందని నియోజకవర్గ ఇన్‌చార్జి సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 2వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం కోడూరు నుండి అవనిగడ్డ వరకు నియోజకవర్గంలోని కార్యకర్తలు రమేష్‌బాబు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ చౌక్‌లో రమేష్‌బాబు మాట్లాడుతూ సాగునీటి కోసం రైతులు ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. రహదారులపై మురుగు పారుతున్నా పట్టించుకునే నాధుడు లేడని విమర్శించారు. దివిసీమలోని మొక్కజొన్న పంటకు సాగునీరు సరఫరా చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆందోళన చేస్తే గాని సాగునీరు విడుదల చేయలేదని ఆయన గుర్తు చేశారు. తనను గెలిపిస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ మండల కన్వీనర్లు రేపల్లె శ్రీనివాసరావు, పరిశే మాధవరావు, భోగాది శేషగిరిరావు, మోహన శివ రాజియ్య, వేమూరి గోవర్దనరావు, వేమూరి వెంకట్రావ్, నాయకులు పేర్ల శ్రీనివాసరావు, పలు గ్రామాల వైకాపా సర్పంచ్‌లు నలుకుర్తి రమేష్, కె నరసింహారావు, బీసాబత్తిన విజయలక్ష్మి, బొందలపాటి లక్ష్మి, కొప్పనాతి వెంకట నారాయం, బీసాబత్తిన ప్రసాద్, సింహాద్రి వెంకటేశ్వరరావు, చింతలపూడి బాలు తదితరులు పాల్గొన్నారు.

కెఆర్‌యు పీజీ సెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల
మచిలీపట్నం (కల్చరల్), మే 16: కృష్ణా విశ్వ విద్యాలయం పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేశారు. కృష్ణా విశ్వ విద్యాలయం ప్రధాన కార్యాలయంలో ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల 11, 12, 13తేదీల్లో పీజీ ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలు నిర్వహించిన అతికొద్ది సమయంలో ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. ప్రవేశ పరీక్షకు 3వేల 81 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2వేల 667 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. అన్ని విభాగాల్లో మహిళల ఉత్తీర్ణతా శా తం పెరిగినట్లు ఉపకులపతి తెలిపారు. మే మా సాంతం లేక జూన్ మొదటి వారంలో కౌన్సిలింగ్ ని ర్వహించనున్నట్లు తెలిపారు. లైఫ్ సైనె్సస్ విభాగం లో జె ఉషాకల్యాణి, షేక్ నేహా ఫాతిమా, కంకిపాటి సౌమ్య శృతి, మందేలు సుష్మిత శ్రవంతి, తోట జ్యోతి ప్రియ, ఫిజికల్ సైన్స్ విభాగంలో పి రవీంద్రరెడ్డి, ఎం లక్ష్మీతేజస్వి, సిహెచ్ కౌసల్య ప్రసాద్, బత్తిన వీర వెంకట వరప్రసాద్, సిరివేరు రాముడు, గణిత విభాగంలో ఎన్ లలిత శివ ప్రసన్న, బండారు విజయ దుర్గా భవాని, ఎ సాహిత్య, షేక్ రహ్మతుల్లా, గుంజా నాగలక్ష్మి, కెమికల్ సైనె్సస్ విభాగంలో జొన్నలగడ్డ అక్షిత, కలిగిరి సమంత సుశాన్, ముప్పనబోయిన సుప్రియ, ఇస్కాల ట్విన్‌కల్, నెపల్లి శివ పార్వతి, సోషల్ సైనె్సస్ విభాగంలో సిహెచ్ ఉమామహేశ్వరరావు, ఎస్‌వి రమణ, దళపతిరావు గిరీష్ వర్మ, ఆత్మూరి పుణ్వి, జె రోహిణి మొదటి ఐదు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆంగ్ల విభాగంలో ఎన్ రోహిణి, ఎస్ రామారావు, అరవ గంగాదేవి, చందన కావ్య, కారే సుచిత్ర ప్రభాకర్, తెలుగు విభాగంలో ఎ హనుమంతరావు, బాపట్ల రవి, వాకా భార్గవ్, షేక్ బాజీ బిబి, బుడుపుల వెంకటేశ్వరరావు తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ కార్యక్రమంలో విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పులిపాటి కింగ్, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకె సుందరకృష్ణ, అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డా. రామశేఖరరెడ్డి, ఉప సంచాలకులు డా. ఇ భవాని, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. లక్ష్మీనారాయణ, డా. బాబురెడ్డి, డా. ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.