కృష్ణ

అక్రమ కట్టడాలను అనుమతించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 19: నగరంలో అనుమతి లేని అక్రమ కట్టడాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని టీపీఎస్ శారద పేర్కొన్నారు. వీఎంసీ కమిషనర్ జే నివాస్ ఆదేశాల మేరకు భవానీపురం, విధ్యాధరపురం సితార జంక్షన్ వద్ద అనధికారికంగా నిర్మిస్తున్న 3వ ఫ్లోర్ నిర్మాణ పనులను అడ్డుకుని అక్రమ ఆక్రమణల నిర్మూలనా దళం సిబ్బందిచే స్లాబ్ సెంట్రింగ్‌ను తొలగించిన ఆమె మాట్లాడుతూ వీఎంసీ మంజూరు చేసిన ప్లాన్‌కు వ్యతిరేకంగా, అనుమతి లేకుండా నిర్మించిన ఏ విధమైన నిర్మాణాలను ప్రోత్సహించేది లేదన్నారు. భవన నిర్మాణదారులు ఈ విషయాన్ని గుర్తించి ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా తమ నిర్మాణాలు జరుపుకోవాలని సూచించారు.
కంకిపాడు, మే 19: బాధ్యతారహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం కింది స్థాయి అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. మండలంలోని కంకిపాడు, గొడవర్రు, నెప్పల్లి, పునాదిపాడు గ్రామాల్లో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. కంకిపాడులో మజ్జిగ పంపిణీని ప్రారంభించిన అనంతరం ఆయన కంకిపాడు లాకుల వద్ద స్లూయిజ్ పనులను పరిశీలించారు. నెలాఖరుకు పనులు పూర్తిచేయాలని, జూన్ మొదటి వారంలో సాగునీటి విడుదలకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. నీటి వృథాను అరికట్టాలని సూచించారు. గొడవర్రులో రూ. 3లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన చెరువు పూడికతీత పనులను తనిఖీ చేశారు. కూలీలకు కల్పిస్తున్న వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన లాం సురేష్ తాను 2014లో ఎస్సీ కార్పొరేషన్ కింద రుణం కోసం దరఖాస్తు చేస్తే నేటివరకూ అందలేని కలెక్టరుకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆయన స్పందిస్తూ ఎండీపీవో కృష్ణమోహన్‌ను సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణం అందేలా చూడాలని ఆదేశించారు. బ్యాంకర్లు విల్లింగ్ ఇవ్వకుంటే అర్హులైన లబ్ధిదారులకు రుణం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులుగా తమపై ఉందని గుర్తుచేశారు. రుణాల మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరించే బ్యాంకర్లపై చర్యలుంటాయని స్పష్టం చేశారు.
నెప్పల్లిలో అధికార్లపై ఆగ్రహం
నెప్పల్లిలో పంటకుంట తవ్వకం పనులను పరిశీలించే క్రమంలో స్థానిక మహిళలు తాము తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పట్టించుకోవటం లేదని కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ స్రవంతిని ప్రశ్నించగా ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవటంతో ఆ శాఖ ఈఈకి కలెక్టర్ ఫోన్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పని ప్రదేశంలో, గ్రామంలో పారిశుద్ధ్య లోపంపై చర్యలు తీసుకోకపోవటంతో ఇన్‌చార్జి కార్యదర్శి శివకృష్ణ పైనా చర్యలు చేపట్టాలని డీపీవోను ఫోన్‌లో ఆదేశించారు. బాధ్యత వహించాల్సిన అధికారులు సక్రమంగా పనిచేయకపోవటంతో మండల ప్రత్యేకాధికారి రమణారెడ్డి, ఎంపీడీవో కృష్ణమోహన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారి వచ్చేవరకూ సమస్యలను పట్టించుకోకపోతే ఎలా?, అధికారులుగా జీతాలు తీసుకునేవారు పని కూడా చేయాలని, అయితే మీ పనితీరు సక్రమంగా లేదంటూ మండిపడ్డారు. ఇద్దరికీ షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు చెప్పారు. పునాదిపాడులో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. సజ్జ, నువ్వు లడ్డూ తీసుకోవాలని, రక్తహీనత నివారిస్తుందని వివరించారు. కంకిపాడు మసీదులో వసతులను పరిశీలించారు. మసీదుకు త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వాలని ముస్లింలు ఆయనను కోరారు. దీంతో ట్రాన్స్‌కో అధికారులు త్రీఫేజ్ విద్యుత్‌కు మీటర్‌ను అక్కడే ముస్లింలకు అందించారు. రోడ్డు విస్తరణలో కోల్పోయిన ఈద్గా విషయంలో ఆందోళన చెందవద్దని, ప్రత్యామ్నాయ స్థలం చూపామని, రంజాన్ ఘనంగా జరుపుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీకాంతం సూచించారు. కార్యక్రమంలో జేసీ-2 పి బాబూరావు, ఇతర జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.

మోదీకి కౌంట్‌డౌన్ ప్రారంభం
* పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ
విజయవాడ (కార్పొరేషన్), మే 19: అప్రజాస్వామ్య పద్ధతిన ముఖ్యమంత్రి పీఠానె్నక్కిన కర్ణాటక సీఎం యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు ముందే రాజీనామా చేయడం ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయానికి చెంపపెట్టని పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు. కర్ణాటక ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు బతికించిందని, భారతీయులంతా గర్వించదగిన రోజని తెలిపారు. చివరి నిమిషం వరకూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నాలు, కుట్రలను కాంగ్రెస్ పార్టీ వమ్ము చేసిందన్నారు. వీడియో క్లిప్పింగ్‌లతో సహా వారి బేరసారాలు బహిర్గతం కావడంతో విధిలేక యడ్యూరప్ప రాజీనామా చేశారన్నారు. కర్ణాటకలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను పరిశీలించిన వారెవరికైనా దేశంలో మోదీ, షా ద్వయం నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించిన విధానాలు అర్థమవుతాయన్నారు. ఇది అంతంకాదు ఆరంభం మాత్రమేనని, రాబోయే 2019లో కేంద్రంలోని బీజేపీ అధికారం కోల్పోవడం, యూపీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న శివాజీ మోదీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు.