కృష్ణ

సీఎంను అగౌరవపర్చడం సబబు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 19: దేవాలయం లాంటి కౌన్సిల్ చట్ట సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అగౌరవపర్చేలా నినాదాలు చేయడం సబబు కాదనే వైసీపీ కార్పొరేటర్లు పూర్ణమ్మ, బీజాన్‌బీ లను సస్పెండ్ చేయడం జరిగిందని మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం వీఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5కోట్ల మంది తెలుగు ప్రజలు ఆరాధించే సీఎం చంద్రబాబును కించపర్చడం సరైన పద్ధతి కాదన్నారు. అవినీతి సొమ్ముతో పుట్టిన పార్టీ వైకాపాని, ఆ పార్టీ అధినేత జగన్ సీఎంపై చేస్తున్న అనుచిత వాఖ్యలు, అతని అనైతిక ప్రవర్తనకు నిదర్శనమన్నారు. జగన్ దోచుకున్నవాటి గురించి కానీ, 16నెలలు జైలు జీవితం గురించి కానీ సీఎం ఎక్కడా ప్రవస్తావించలేదని, అలాంటిది జగన్ వీధుల వెంబడి తిరుగుతూ ఉరితీయాలని, నడిరోడ్డుపై కాల్చాలని, నూతిలో పడవేయాలని, ఇలా అనేక మాటలు సీఎంను అనడం గర్హనీయమన్నారు. కౌన్సిల్ ఏజెండాలో ప్రతిపాదన వచ్చినంత మాత్రాన అది అమలులోకి వచ్చినట్టు కాదన్న మేయర్, కార్పొరేషన్ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తామని, ప్రతిపక్షం సభ్యులు కౌన్సిల్‌లో, బయట విపక్షాలు లేనిపోని యాగి చేశారని, నోటికొచ్చినట్టు అధికార పార్టీ సభ్యులపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని సూచించారు. కౌన్సిల్ తీర్మానం ఎలా జరుగుతుందో గమనించి, ఆతరువాత ఆందోళనలు, ఆరోపణలు చేస్తే బాగుంటుందని హితవుపలికారు. తనకు టీడీపీ ఫ్లోర్ లీడర్ జీ హరిబాబు మధ్య విబేధాలున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇటీవలే ఆయన ఒక పని నిమిత్తం ఒకరిని పంపిస్తే కలెక్టర్‌తో మాట్లాడి మరీ ఆ పని చేసిపెట్టానన్నారు. హరిబాబుతో తనకు మంచి సంబంధాలున్నాయడానికి ఇదే నిదర్శనమన్నారు. అలాగే ఎవరికైనా ఎదగాలని కోరిక ఉంటుందని, తనకు పార్టీ అప్పగించిన మేయర్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడమే తన ప్రధాన కర్తవ్యమన్నారు. అలాగే కార్పొరేటర్లు ఎవరైనా మేయర్ పదవి అడగవచ్చని స్పష్టం చేశారు.

కర్నాటకలో ప్రజాస్వామ్య విజయం
* డీసీసీ అధ్యక్షుడు ధనేకుల
పెనమలూరు, మే 19: కర్నాటక అసెంబ్లీలో ప్రజాస్వామ్యమే గెలిచిందని, బీజేపీ ఎత్తుగడలు సుప్రీం కోర్టు ముందు సాగలేదని, బలపరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేయటంతో ప్రజాస్వామ్యంపై నమ్మకం ఏర్పడిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్‌రావు అన్నారు. కామయ్యతోపులోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మోదీ పరిపాలన ఒక నియంత మాదిరిగా ఉందని విమర్శించారు. కర్నాటకలో మెజార్టీ లేకున్నా అవినీతితో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నించి విఫలం కావటం మోదీకి మింగుడు పడటం లేదన్నారు. 3రోజుల ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కీలారు వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.

కువైట్‌లో టీడీపీ ఇఫ్తార్ విందు
పెనమలూరు, మే 19: కువైట్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు సభకు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కువైట్‌లో మినీ మహానాడు సభతో పాటు గ్రాండ్ ఇఫ్తార్ విందు వేడుకల్లో ఎంపీ కేశినేని నాని, అనంతపురం ఎమ్మెల్యే వై ప్రభాకరచౌదరి, రాష్ట్ర ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఎం హిదాయత్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ నౌమాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ కువైట్ అధ్యక్షుడు సుధాకరరావు కుదరవల్లి, ఉపాధ్యక్షుడు బాతల చంద్రవౌళి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ముస్లిం మైనార్టీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.