కృష్ణ

కేంద్రంతో వైకాపా, జనసేన లాలూచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, మే 19 : వైకాపా, జనసేన కేంద్రంతో లాలూచీ పడి ప్రత్యేక హోదా విషయంలో 5 కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నాయని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఆరోపించారు. శనివారం స్థానిక వీకేఆర్, వీఎన్‌బీ అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆవరణలోని వేములపల్లి కనె్వన్షన్‌లో జరిగిన గుడివాడ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. వైకాపా అధినేత జగన్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు సంపాదించాడని, త్వరలో పూర్తి స్థాయి జైలు జీవితం గడపక తప్పదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు దేశవ్యాప్తంగా పెరిగాయన్నారు. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయన్నారు. 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చిందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నారన్నారు. బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ 2019 నాటికి పోలవరాన్ని పూర్తి చేసేందుకు ప్రతి సోమవారం సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణంతో అనేక ప్రాజెక్ట్‌లు రాష్ట్రానికి రానున్నాయని, నిరుద్యోగ సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందన్నారు. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపై ఉందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకీ పడుతుందన్నారు. చంద్రబాబు వల్లే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా వాటిని లెక్కచేయకుండా చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. చంద్రబాబు ముందుచూపు వల్లే పట్టిసీమ వచ్చిందన్నారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఆరు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ నెల 27, 28, 29తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర మహానాడులో ఈ తీర్మానాలను అందజేస్తామని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ సమావేశంలో పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, తూర్పు కృష్ణాడెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుత్తా చంటి, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి, గుడ్లవల్లేరు ఎంపీపీ కొసరాజు విజయభారతి, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు బొల్లా వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నుగలాపు వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు వల్లభనేని బాబూరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ అరికేపూడి రామశాస్ర్తీ, జిల్లా నాయకులు డాక్టర్ పొట్లూరి గంగాధరావు, లింగం శ్రీనాగలక్ష్మి, గంటా బాలాజీ, కాకొల్లు రాజారెడ్డి, లంకదాసరి ప్రసాదరావు, జంగం మోహనరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ గోర్జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కర్నాటక నుండే బీజేపీ పతనం ప్రారంభం
తోట్లవల్లూరు, మే 19 : నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని అర్పించిన గొప్ప నాయకుడు పుచ్చలపల్లి సుందరరామయ్య అని మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య అన్నారు. పుచ్చలపల్లి సుందర రామయ్య ప్రజల మనుస్సులో హత్తుకు పోయిన వ్యక్తి అని, పేదరిక నిర్మూలన, అంటరానితనంపై జీవితాతం పోరాడారని అన్నారు. మండలంలోని యాకమూరు దళితవాడలో సాతులూరి ఆదాం స్మారక స్థూపం వద్ద శనివారం మండల సీపీఎం కార్యదర్శి సీహెచ్ సుబ్బారావు తదితరుల ఆధ్వర్యంలో సుందరయ్య 33వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముందుగా సీపీఎం జెండాను రామయ్య ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పుచ్చలపల్లి విలువలు గల రాజకీయాలు చేశారన్నారు. పేదల కోసం ఆస్థులను సైతం వదులుకుని ప్రజా ఉద్యమంలోకి వచ్చారన్నారు. నేటి తరానికి సుందరయ్య ఆశయాలను వివరించి ఆయన బాటలో నడిచేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల సీపీఎం కార్యదర్శి సీహెచ్ సుబ్బారావు, జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం హరిబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బి కోటేశ్వరరావు, మర్రెడ్డి శ్రీరాములు, శివనాగేంద్రం, జే ఏసేబు, కె కొండలబాబు, రాజారావు, భాస్కరరావు పాల్గొన్నారు.

మంచినీటి ఎద్దడి రానివ్వకండి
మచిలీపట్నం, మే 19: వేసవిలో మంచినీటి సమస్యను అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో స్థారుూ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీటి సరఫరా, గృహ నిర్మాణం, విద్య, వైద్యం, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై సమీక్షించారు. చైర్‌పర్సన్ అనూరాధ మాట్లాడుతూ వేసవి కావటంతో ఏ గ్రామంలోనూ మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. మంచినీటి సమస్య ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైతే శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. పైప్‌లైన్ లీకేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యాలను నివారించాలన్నారు. లబ్ధిదారులను ఒకటికి పది సార్లు తిప్పుకోకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. వేసవి సెలవు నేపథ్యంలో పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించాలన్నారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. వృద్దాప్య, వికలాంగ పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే ముందుగానే సవరించుకోవాలన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో సాగుతున్న పడవ ప్రమాదాలపై అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. లైసెన్సులు లేకుండా పడవలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పీహెచ్‌సీల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. వడదెబ్బ నివారణకు విస్తృతంగా మందులు పంపిణీ చేయాలన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి, సీఇఓ కె శ్రీదేవి, పలువురు జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.