క్రైమ్/లీగల్

రక్త సంబంధం కన్నా... అక్రమ సంబంధమే మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, జూలై 11: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఇంటి నుండి గెంటేస్తే అప్పుగా తీసుకున్న రూ.4లక్షలు తిరిగి ఇవ్వాలని కన్న తండ్రిని ప్రియుడితో కలిసి కర్కశంగా కడతేర్చిన కన్న కూతురి నిర్వాకమిది. అక్రమ సంబంధం ముందు రక్త సంబంధం ఓ లెక్కా అనుకున్న ఓ కన్నకూతురు నిర్భయంగా, నిర్దయగా సాగించిన హత్యాకాండకు ఆ తండ్రి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. నూజివీడు సమీపంలోని తుక్కులూరులో గుట్టు చప్పుడు కాకుండా హత్య చేసి చల్లపల్లి మండలం నడకుదురు, నిమ్మగడ్డ రోడ్డులో మృతదేహాన్ని పడవేసి ఏమీ తెలియనట్లు అమాయకత్వాన్ని ఒలకబోసి కేసును పక్కదారి పట్టిస్తూ సస్పెన్స్ థిల్లర్‌ను తలపించేలా హత్యోదంతాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేసిన వారి గుట్టును చల్లపల్లి పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. నేరాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసిన అవనిగడ్డ డీఎస్పీ బి పోతురాజు హత్యోదంతానికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 1న మండల పరిధిలోని నడకుదురు, నిమ్మగడ్డ మార్గమధ్యలో గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు సదరు విషయం పత్రికల్లో రావడంతో గుర్తించిన మృతుని కుమార్తె లింగమనేని శేషుకుమారి మృతదేహం తన తండ్రి కాజ కృష్ణప్రసాద్ (60)దని గుర్తుపట్టి చల్లపల్లి పోలీసులను సంప్రదించింది. పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ మార్చురీలో భద్రపర్చిన మృతదేహాన్ని శేషుకుమారికి చూపించగా పెన్షన్ తీసుకుని వస్తానని ఇంటి నుండి వెళ్లిన తన తండ్రి తిరిగి రాకుండా నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి బోరున విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. అనంతరం తండ్రి శవాన్ని అవనిగడ్డలోనే ఖననం చేసి తమకెవరూ శత్రువులు లేరని, తనకు ఎవరి మీదా అనుమానం లేదని ఉదయం వచ్చేటప్పుడు తన తండ్రి సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే మర్చిపోయి వచ్చాడని స్టేట్‌మెంట్ ఇచ్చింది. కేసు మిస్టరీని ఛేదించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో మృతుడు కృష్ణప్రసాద్ కుమార్తె, ముద్దాయి లింగమనేని శేషుకుమారి కాల్ డేటాలను పరిశీలించడంతో పాటు సీసీ టీవీ పుటేజిలను పరిశీలించి వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పోలీసులనే ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడ్డాయి. హోటల్ కార్మికుడిగా జీవిస్తున్న మృతుడు కృష్ణప్రసాద్‌ది హత్యేనని నిర్దారించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో లభించిన ఆధారాలతో నిందితురాలు శేషుకుమారిని, తన ప్రియుడు వేముల వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య తామే చేశామని ఒప్పుకున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం తన భర్త చనిపోగా కుమార్తె చదువు నిమిత్తం శేషుకుమారి నూజివీడులోని తుమ్మలవారి వీధిలో అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన గ్యాస్ స్టౌవ్ మెకానిక్ వేముల వెంకటేశ్వరరావుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన తండ్రి కృష్ణప్రసాద్ గతంలో తను చేరదీసిన మహిళ చనిపోవడంతో తన వద్ద ఉన్న నగదుతో కుమార్తె శేషుకుమారి వద్దకు చేరాడు. ఈ క్రమంలో తన కుమార్తె వెంకటేశ్వరరావుతో అక్రమ సంబంధం నడపటాన్ని సహించలేని కృష్ణప్రసాద్ అనేక సార్లు మందలించినప్పటికీ కూతురి వైఖరిలో మార్పు రాలేదు. జూన్ 30వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో శేషుకుమారి గదిలో నుండి మాటలు వినిపించటంతో అనుమానించిన కృష్ణప్రసాద్ తలుపు తెరవాలని కుమార్తెను బిగ్గరగా కేకలు వేస్తూ తలుపు కొట్టాడు. తన తండ్రిని ఇంటి నుండి గెంటివేస్తే తన వద్ద అప్పుగా తీసుకున్న రూ.4లక్షలు తిరిగి చెల్లించాల్సి వస్తుందని, దాని కంటే హతమార్చడమే మార్గమని నిర్ణయించుకున్న శేషుకుమారి, వెంకటేశ్వరరావులు తలుపు తెరవటంతోనే ఒక్కసారిగా వెంకటేశ్వరరావు మృతుడు కృష్ణప్రసాద్‌ను బలంగా వెనక్కు నెట్టడంతో మృతుడు మంచంపై పడిన కృష్ణప్రసాద్ వేస్తున్న కేకలకు తన అక్రమ సంబంధం బయట పడుతుందన్న ఆలోచనతో శేషుకుమారి తన తండ్రి ముఖంపై దిండుపెట్టి అదమగా పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు మరింత బలంగా దిండును నొక్కిపట్టుకున్నాడు. ఈ సమయంలో కృష్ణప్రసాద్ ఊపిరి ఆడక కాళ్లు, చేతులతో కదిలిస్తూ ఉండటంతో శేషుకుమారి తన తండ్రి కాళ్లను బలంగా ఒత్తి పట్టుకోగా అప్పటికే దిండు ముఖంపై నొక్కుతున్న వెంకటేశ్వరరావు ఓ చేతితో దిండును నొక్కిపట్టి మరో చేతితో మంచం కింద దొరికిన చిన్న రాడ్డు లాంటి ఆయుధంతో మృతుని తల వెనుక భాగంలో కొట్టగా కృష్ణప్రసాద్ ప్రాణాలు విడిచాడు. అనంతరం మృతదేహాన్ని నిర్జల ప్రదేశంలో పడవేయాలని చెరుకు తోటలో పడేస్తే కొంత కాలానికి మృతదేహం గుర్తు పట్టలేని విధంగా మారుతుందని ఆలోచన చేసి వెంకటేశ్వరరావుకు ఉన్న కారులో మృతదేహాన్ని రాత్రి 11.30 గంటల సమయంలో పడవేసి మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి పురిటిగడ్డ రోడ్డులోని చెరుకుతోట పక్కన మృతదేహాన్ని పడవేశారు. మృతదేహాన్ని చెరుకుతోటలోకి మార్చే క్రమంలో స్థానికుల అలికిడి తెలుసుకుని అక్కడ నుండి పరారయ్యారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతికత సహాయంతో సేకరించిన ఆధారాలతో హత్య కేసుగా మార్పు చేశారు. నిందితులను అరెస్టు చేసి బుధవారం మీడియా ఎదుట హాజరుపర్చారు. అనంతరం అవనిగడ్డ కోర్టుకు తరలించారు.