కృష్ణ

మూడేళ్లుగా ఎంతో నష్టపోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 11: గడిచిన మూడేళ్లుగా ఎంతో నష్టపోయామని, పోర్టు అనుబంధ పరిశ్రమలకు భూములు ఇచ్చే ప్రసక్తి లేదని బందరు మండలం బుద్ధాలపాలెం, బొర్రపోతుపాలెం, కాకర్లమూడి గ్రామ రైతులు మరోసారి ముడ అధికారులకు తెగేసి చెప్పారు. ముందు పోర్టు నిర్మిస్తే ఆ తర్వాత పరిశ్రమలకు భూములు ఇచ్చే విషయమై ఆలోచన చేస్తామన్నారు. అంతే గానీ పోర్టు కట్టకుండానే పరిశ్రమలకు భూములు అంటే ఎలా ఇస్తామంటూ ప్రశ్నించారు. పరిశ్రమల స్థాపన కోసం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తామని చెబుతున్నారే గానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడం గర్హనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడ మాష్టర్ ప్లాన్ తయారీపై ప్రజల సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు గాను ముడ అధికారులు బుధవారం పై గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ముడ వైస్ చైర్మన్ పి విల్సన్ బాబు, ముడ డెప్యూటీ కలెక్టర్ సుజాతతో పాటు అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి భాస్కర్ ఈ గ్రామసభలకు హాజరై ముడ మాష్టర్ ప్లాన్‌ను గ్రామస్థులకు వివరించారు. అయితే మూడు గ్రామాల్లో రైతులు ముడ అధికారులను ప్రశ్నలతో ముంచెత్తారు. భూసేకరణ నోటిఫికేషన్ కారణంగా మూడేళ్లుగా తమ భూములను అమ్ముకునేందుకు, బ్యాంక్ రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. దీని వల్ల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ముడ వీసీ విల్సన్ బాబు మాట్లాడుతూ మరో 15 రోజుల్లో భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఇస్తేనే భూములు తీసుకుంటామని తెలిపారు. బలవంతంగా మాత్రం తీసుకోమని స్పష్టం చేశారు. రైతులకు న్యాయమైన ధర చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పోర్టు, పరిశ్రమల ద్వారా ఈ ప్రాంతం ఇతోధికంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఈ ప్రాంత అభివృద్ధితోనే మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ముడ వీసీ విల్సన్ బాబు తెలిపారు.

నేడు ఆశ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు భేటీ
విజయవాడ, జూలై 11: ఆశా కార్యకర్తలకు గురువారం జరిగే అవగాహన సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని స్ర్తి, శిశు సంక్షేమ కార్యదర్శి కె.సునీత, జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలియజేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లను బుధవారం స్ర్తి, శిశు సంక్షేమ కార్యదర్శి కె.సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 43 వేల మంది ఆశా కార్యకర్తలు ఐసీడీఎస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై ఆరోగ్యవంతమైన పౌష్టికాహార లోప రహిత సమాజాన్ని నిర్మించడంలో ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని విధాలా ఆశా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ఐసీడీఎస్ కేంద్రాలను ఉన్నతంగా తీర్చిదిద్ది, ఐఎస్‌వో సర్ట్ఫికేట్ సాధించే దిశలో నిర్ణయాత్మకమైన పాత్రను పోషించే విషయంలో చైతన్యపర్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల నుండి ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ ఆశా కార్యకర్తల రాష్ట్ర స్థాయి సమావేశానికి సంబంధించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. గురువారం ఉదయం ఈ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారన్నారు. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 పి.బాబురావు, ఐసీడీఎస్ పీడీ కె.కృష్ణమూర్తి, సీఎం సెక్యూరిటీ అధికారి జోషి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కళాపీఠంలో ఎంపీఓ ప్రవేశాలు ప్రారంభం
కూచిపూడి, జూలై 11: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఎట్టకేలకు స్థానిక శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో ఎంపీఓ తరగతుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏటా జూన్ నెలాఖరుకే శిక్షణ తరగతులు ప్రారంభించే విశ్వ విద్యాలయం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా నిలిచిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో కోర్సుల నిర్వహణపై కొనసాగుతున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ విశ్వవిద్యాలయం ఎంపీఎ మొదటి సంవత్సరం ప్రవేశానికి సర్ట్ఫికెట్ పరిశీలనను బుధవారం ప్రారంభించారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్‌వి సత్యనారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య అలైక్య కుంచాల ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్థుల ప్రవేశ సర్ట్ఫికేట్ల పరిశీలనను ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్ర్తీ, సూపరింటెండెంట్ డా. ఎ పార్వతి 14 మంది విద్యార్థుల సర్ట్ఫికెట్లను పరిశీలించి ప్రవేశానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తులు పెట్టుకున్న ఔత్సాహిక విద్యార్థులు ఈ నెల 24వ తేదీ వరకు నేరుగా కళాపీఠంలో ప్రవేశానికి తగిన సర్ట్ఫికెట్లతో రావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. కూచిపూడి నాట్యంలో సర్ట్ఫికెట్, డిప్లమా కోర్సులతో పాటు ఎంపీఎ, కర్ణాటక సంగీతం తదితర కోర్సులలో శిక్షణ పొందే విద్యార్థులు తమ మార్కుల లిస్టులు, ఆధార్ సర్ట్ఫికెట్లతో ఈ నెల 24వ తేదీ లోగా నేరుగా రావాలని ప్రిన్సిపాల్ సూచించారు.