కృష్ణ

కాంట్రాక్ట్, ప్రైవేటు కార్మికుల మధ్య వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, జూలై 11: గత 12 రోజులుగా నగర పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలపై విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్న నేపథ్యంలో పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ 2 బాబూరావు నందిగామకు వచ్చి ప్రైవేటు కార్మికులతో సమావేశమై పారిశుద్ధ్యంపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో బుధవారం నగర పంచాయతీ అధికారులు ప్రైవేటు కార్మికులతో చెత్త తొలగింపునకు చర్యలు తీసుకుంటుండగా కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకున్నారు. కాంట్రాక్ట్, ప్రైవేటు కార్మికులకు మధ్య వివాదం ఏర్పడటంతో ఇన్స్‌పెక్టర్ (ఎస్‌హెచ్‌ఒ) పివి రమణ సిబ్బందితో అక్కడకు చేరుకొని కాంట్రాక్ట్ కార్మికులను, కార్మిక సంఘ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనకు సీపీఎం, వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులు పోలీస్ స్టేషన్ వద్దే షామియానా వేసి ధర్నా చేశారు. పోలీస్ చర్యలను నిరసిస్తూ నినాదాలు చేసారు. పోలీస్ స్టేషన్‌లో ఉదయం నుండి సాయంత్రం వరకూ ఇన్స్‌పెక్టర్ పివి రమణ, తహశీల్దార్ శ్రీరామకృష్ణ, చైర్‌పర్సన్ వై పద్మావతి, కమిషనర్ మల్లేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండూరు వెంకటరమణ, సీపీఎం నేతలు యార్లగడ్డ జోయ, చనుమోలు సైదులు, కటారపు గోపాల్, వైకాపా కన్వీనర్ కత్రోజు శ్రీనివాసాచారి తదితరులు పలు దఫాలు చర్చలు జరిపారు. చివరకు కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొత్త కాంట్రాక్ట్ పద్ధతిలో కొన్ని సవరణలు చేసి కార్మికులకు అనుకూలంగా పనులు చేసే విధంగా ఒప్పందాలు జరగడంతో కార్మిక సంఘ నేతలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం నుండి కార్మికులు యధావిధిగా పనుల్లో చేరుతున్నట్లు తెలిపారు.

పరిపూర్ణానంద స్వామి గృహ నిర్బంధం గర్హనీయం
మచిలీపట్నం (కల్చరల్) జూలై 11: అద్వైత సిద్దాంత ప్రచారకుడు, తర్కకోవిదుడు, దళిత జనోద్ధారకుడు శ్రీ పీఠాధిపతి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీని తెలంగాణ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచడం అమానుషం అని విశ్వహిందూ పరిషత్ తూర్పుకృష్ణా జిల్లా శాఖ అధ్యక్షుడు డా. బి ధన్వంతరి ఆచార్య అన్నారు. స్వామీజీపై ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించటం గర్హనీయమన్నారు. ఈ చర్యకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ తూర్పు కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ర్యాలీ, అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో పరిషత్ ప్రతినిధులు సిహెచ్ సూర్యప్రకాశరావు, అల్లూరి లక్ష్మీకాంతారావు, డా. ఉడత్తు శ్రీనివాసరావు, కె శ్రీకాంత్, బీజెపీ నాయకులు తోట రంగనాధ్, దూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, ఆర్‌ఎస్‌ఎస్, సామాజిక సమరసత, ఎబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

ఎంసెట్ కోచింగ్ సెంటర్‌గా మొవ్వ జూ. కళాశాల
కూచిపూడి, జూలై 11: మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ ఏడాది నుండి ఎంసెట్ కోచింగ్‌ను జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు డీవీఇఓ కె వెంకట్రామయ్య పేర్కొన్నారు. బుధవారం కళాశాలలో శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డిఎస్‌ఆర్‌వి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో డీవీఇఓ ప్రసంగిస్తూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం రూ.25వేల కోట్లు కేటాయించిందన్నారు. ఈ విధంగా పేద, బడుగు, బలహీన వర్గాలు విద్యను అభ్యసించే ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, నోట్‌బుక్స్, స్కాలర్‌షిప్‌లను విద్యార్థులకు నేరుగా అందే విధంగా ఏర్పాటు చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుని కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ లక్ష్యాలను అధిగమింప చేయాలని సూచించారు. సెంటర్‌ఫర్ ఎక్సలెన్స్ అనే పథకం ద్వారా జిల్లాలో మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ రెండు కళాశాలల్లో ఎంసెట్, నీట్, ట్రిపుల్ ఐటీ, జెఇఇ, జప్మా, ఎయిమ్స్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ ఏడాది నుండి ఇంటర్ మొదటి సంవత్సరం నుండి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐఓ సిఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి, పి ఉషాకిరణ్, టి శ్రీనివాసరావు, వాసుబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.