కృష్ణ

జిల్లా పంచాయతీ అధికారిగా విక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 11: జిల్లా పంచాయతీ అధికారిగా ఆర్ విక్టర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గుడివాడ డివిజనల్ పంచాయతీ అధికారిగా పని చేస్తున్న ఆయన ఇటీవల జిల్లా పంచాయతీ అధికారిగా పదోన్నతి పొందారు. ఇప్పటి వరకు జిల్లా పంచాయతీ అధికారిగా పని చేసి పదవీ విరమణ చేసిన సుబ్రహ్మణ్యం స్థానంలో విక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం విక్టర్ విజయవాడలో కలెక్టర్ బి లక్ష్మీకాంతంను మర్యాద పూర్వకంగా కలిసి బాధ్యతలు స్వీకరించారు. విక్టర్ బాబు గతంలో జిల్లా పంచాయతీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేశారు. ఆ తర్వాత డీఎల్‌పీఓగా పదోన్నతి పొంది పశ్చిమ గోదావరి కొవ్వూరు, గుడివాడలో పని చేశారు. ప్రస్తుతం గుడివాడ డీఎల్‌పీఓగా పని చేస్తూ పదోన్నతిపై జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు స్వీకరించడం విశేషం.

పదవులకు జంపాన, తుమ్మల గుడ్‌బై
ఉయ్యూరు, జూలై 11: గత రెండు రోజులుగా అధికార తెలుగుదేశం పార్టీలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య బుధవారం చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, వైస్ చైర్మన్ తుమ్మల శ్రీనుబాబు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. మున్సిపల్ చైర్మన్ పదవి పంపకంలో నెలకొన్న వివాదం తీవ్ర రూపం దాల్చి పార్టీలోని రెండు బలమైన సామాజిక వర్గాలు బలప్రదర్శనకు దిగడం, రెండు రోజులుగా బుజ్జగింపుల పర్వం కొనసాగడం పాఠకులకు విదితమే. ఈ నేపధ్యంలో బుధవారం చైర్మన్, వైస్ చైర్మన్ తమ పదవులకు రాజీనామా సమర్పించారు. పెనమలూరు ఎమ్మెల్సే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, రాష్టప్రార్టీ కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, ఎఎంసి చైర్మన్ అబుల్ కలాం వెంటరాగా కమిషనర్ రాంకుమార్‌కు తన రాజీనామా పత్రాలను అందచేసారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజాప్రతినిధి పైనే అవిశ్వాసం పెట్టే స్ధాయికి భవిష్యత్‌లో పరిణామాలు తలెత్తకుండా చూడాలని, పార్టీ భవిష్యత్‌కు అది విఘాతం కల్గిస్తుందని అన్నారు. తన పదవీకాలంలో పట్టణ అభివృద్ధికి అవిశ్రాంత కృషి చేసానని, పార్టీ తీసుకున్న కఠిన నిర్ణయానికి కట్టుబడి రాజీనామా చేసానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఓకానొక సమయంలో ఆయన కళ్ళ వెంట నీళ్ళు తిరగడం, శోకం బయటకు రావడం అందరిని కలచివేసింది. ఈ సంధర్భంగా ఎంఎల్‌ఎ బోడే ప్రసాద్ మాట్లాడుతూ సమస్యను కుటుంబ సమస్యగా తీసుకొని చర్చల ద్వారా పరిష్కరించుకున్నామని, ఈ వివాదం టీకప్పులో తుఫాన్ వంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్‌లు, నగరపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.