కృష్ణ

నాటిన ప్రతి మొక్కా మనల్ని బతికిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జూలై 12: రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 26 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. ఈ నెల 14 నుండి కార్తీకమాసం లోపు వీటిని నాటి సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని, దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించి మొక్కలు నాటాలని కోరారు. రాష్ట్రంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి ప్రాంగణంలో ఈ నెల 14వ తేదీన మొక్కలు నాటి లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శిద్దా రాఘవరావు గురువారం పరిశీలించారు. అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఐదు నెలల వ్యవధిలో 26 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యమని, ప్రారంభం రోజునే కోటి మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకునే చర్యలలో భాగంగా 50 శాతం విస్తీర్ణంలో మొక్కలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మొక్కల పెంపకంలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ఆయన వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సంక్షేమ వసతిగృహాలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, దేవాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి శిద్దా రాఘవరావు పిలుపిచ్చారు. సమాజంలోని వివిధ వర్గాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు రిజ్వీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు నళినిమోహన్, రాహుల్‌పాండే, నూజివీడు రెవిన్యూ డివిజనల్ అధికారి చెరుకూరి రంగయ్య, ట్రిపుల్ ఐటి డైరెక్టరు వీరంకి వెంకటదాసు, నూజివీడు తహశీల్దార్ జి విక్టర్‌బాబు, పురపాలక సంఘ కమిషనర్ వాసుబాబుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లాలో ఆరుగురు ఎస్‌ఐల బదిలీ
మచిలీపట్నం, జూలై 12: జిల్లాలో ఆరుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విఆర్‌లో ఉన్న ఇరువురికి పోస్టింగ్ ఇవ్వగా పలు స్టేషన్‌లలో ఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తున్న మరో ఇరువురిని విఆర్‌లో పెడుతూ ఆదేశాలు జారీ చేశారు. వీఆర్‌లో ఉన్న ఎల్‌ఆర్ సోమేశ్వరరావును గంపలగూడెం పోలీసు స్టేషన్‌కు, కె శ్రీనివాసును బంటుమిల్లి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. విస్సన్నపేట ఎస్‌ఐగా పని చేస్తున్న బి తులసీధర్‌ను, బంటుమిల్లి ఎస్‌ఐగా పని చేస్తున్న డిడి మహేశ్వరరావును వీఆర్‌లో పెట్టారు. గుడివాడ వన్‌టౌన్ ఎస్‌ఐగా పని చేస్తున్న పి గౌతమ్ కుమార్‌ను విస్సన్నపేటకు, జిల్లా ట్రైనింగ్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న కె ఈశ్వరరావును ఇనగుదురు పోలీసు స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.