క్రైమ్/లీగల్

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 13: ఇంటర్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పటమట పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... తాడేపల్లిగూడెంలో నివాసముంటున్న మాన్యం శ్రీనివాసరావు స్థానికంగా ఎస్‌బిఐ బ్యాంకు బ్రాంచి మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు నితిన్ నగరంలోని గురునానక్ కాలనీలో ఉన్న మయూరి భవన్‌లోని చైతన్య జూనియర్ కళాశాల క్యాంపస్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. కాగా ఆరోగ్యం బాగోలేదని ఈనెల 12వ తేదీన ఇంటికి వెళ్లి వచ్చిన నితిన్ 13తేదీ శుక్రవారం తిరిగి హాస్టల్‌కు వచ్చాడు. ఒంట్లో బాగోలేదని సిక్ రూముకు వెళ్లిన నితిన్ గదిలో ఫ్యానుకు బెడ్‌షీటుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న కళాశాల నిర్వాహకుల సమాచారం మేరకు పటమట పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాన్నా.. క్షమించు.. అమ్మను బాగా చూసుకో అంటూ రాసి ఉండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు నగరానికి చేరుకుని కుమారుని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక చదవలేక ఆఘాయిత్యానికి పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మహిళ గొంతు కోసిన దుండగులు
* చోరీ యత్నం విఫలమై పరాయిన దొంగలు
విజయవాడ (క్రైం), జూలై 13: ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించిన అగంతకులు ఒంటరిగా ఉన్న మహిళ గొంతు కోసి పరారైన ఘటన సత్యనారాయణపురంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యనారాయణపురం ఆచారి వారి వీధిలో నివాసముంటున్న ఉప్పులూరి మురళి ఆటోనగర్‌లోని ఓ పెస్టిసైడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం డ్యూటీకి వెళ్లిపోయాడు. ఇంట్లో భార్య వెంకట పద్మజ (52) ఒంటరిగా ఉన్నారు. కాగా శుక్రవారం మధ్యాహ్నాం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తలుపు కొట్టారు. ఇంట్లో ఉన్న పద్మజ ఎవరు కావాలని అడిగింది. మీ భర్త మురళీ ఉన్నారా అని ప్రశ్నించారు. లేరని సమాధానం చెప్పడంతో వెళ్లిపోయిన దుండగులు అరగంట తర్వాత మళ్లీ వచ్చి తలుపు కొట్టారు. తలుపు తీసిన పద్మజను బలవంతంగా నెట్టి లోనికి చొరబడ్డారు. దీంతో ఆమె గట్టిగా కేకలు పెట్టడంతో దుండగులు ఒకరు ఆమెను గట్టిగా పట్టుకోగా.. మరొకరు చాకుతో గొంతు కోసి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సత్యనారాయణపురం పోలీసులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన పద్మజ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు భర్త మురళి పేరును ప్రస్తావించడంతో తెలిసినవారే ఈ చర్యకు పూనుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. భర్త డ్యూటీకి వెళ్లిపోయాక ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పద్మజను గమనించి కొద్ది రోజులుగా రెక్కీ నిర్వహించిన దుండగులు ఎట్టకేలకు ఈఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. సత్యనారాయణపురం సీఐ పి కనకారావు, సీసీఎస్ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. జాయింట్ సీపీ కాంతి రానా టాటా ఆదేశాలతో ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నాయి. కాగా సీసీ కెమేరా పుటేజీల ద్వారా ఇప్పటికే నిందితులను పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉండే వ్యక్తులే ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.