కృష్ణ

ఏటా 20వేల మందికి ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, జూలై 13: జిల్లాలో ఈ ఏడాది 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు, నిరుద్యోగ రహిత జిల్లాగా చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడించారు. స్థానిక గాంధీ క్షేత్రంలో డీఆర్‌డీఎ, స్కిల్ డెవలప్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విభిన్న ప్రతిభ చూపిన వారికే ఉద్యోగాలు వస్తున్నాయని, కావున విద్యతో పాటు ప్రతిభా నైపుణ్యం ఎంతో అవసరమన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న జాబ్ మేళాల్లో ఉద్యోగం పొందిన వారి వివరాలతో ఎంప్లాయింగ్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి కుటుంబం కనీసం నెలకు రూ.10వేలు ఆదాయం వచ్చేలా రుణాలు మంజూరుతో పాటు నిరుద్యోగులకు జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఈ నెల 11న అన్న క్యాంటీన్‌లను ప్రారంభించి రూ.5లకే అల్పాహారం, భోజనం అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఎన్‌ఆర్‌ఐల సహకారంతో అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు ఇటీవల తన అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులు హామీ ఇచ్చారన్నారు. సభకు అధ్యక్షత వహించిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో 2,863 మంది అభ్యర్థులు హాజరు కాగా 636 మందిని నేరుగా ఎంపిక చేశారన్నారు. మరో 904 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకుంటారని తెలిపారు. తొలుత నియోజకవర్గ పరిధిలోని 63 మందికి సీఎం సహాయ నిధి నుండి వచ్చిన రూ.25 లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, ఉప సుభాపతి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరాజు, ఎంపీపీ బండి కనకదుర్గ, జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పచ్చదనం పరచుకోవాలి!
నేటి చంద్రబాబు పర్యటనకు సర్వం సిద్ధం
నూజివీడు, జూలై 12: ప్రతి ఇంటి ముందు మొక్కలు ఉండాలి... ఎక్కడ చూసినా పచ్చదనం కనువిందు చేయాలి... రాష్ట్రం హరితాంధ్ర ప్రదేశ్ కావాలనే ప్రధాన సంకల్పానికి నూజివీడు వేదిక కాబోతోంది. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా వనం-మనం కార్యక్రమాన్ని కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం వనమహోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణానికి చేరుకున్న కలెక్టర్ లక్ష్మీకాంతం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, అవసరమైన సూచనలు చేశారు. హెలీపాడ్ వద్ద నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటే ప్రాంతం, తరువాత ట్రిపుల్ ఐటీ విద్యార్ధులతో ముచ్చటించే ప్రాంగణాన్ని, బహిరంగ సభ ప్రాంతాలను కలెక్టర్ సందర్శించారు. అటవీ, రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా 26 కోట్ల మొక్కలను నాటేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. శనివారం ప్రారంభమైన వనమహోత్స కార్యక్రమం కార్తీకమాసానంతం వరకు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం శుక్రవారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడుతూ 69వ వనమహోత్సవ రాష్టస్ధ్రాయి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం నూజివీడు లో ప్రారంభిస్తారని చెప్పారు. మొక్కలు ఆక్సిజన్‌ను విడుదల చేసి, కార్బన్‌డైయాక్సైడ్‌ను పీల్చుకోవటం ద్వారా వాతావరణంలో సమతూల్యత ఏర్పడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం 10.30 గంటలకు నూజివీడు చేరుకుని 12.40 గంటల వరకు ఉంటారని, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు. కలెక్టర్ వెంట చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు రిజ్వీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు నళినిమోహన్, రాహుల్‌పాండే, నూజివీడు ఆర్డీఓ చెరుకూరి రంగయ్య, ట్రిపుల్‌ఐటి డైరక్టరు వీరంకి వెంకటదాసు, తహశీల్దార్ విక్టర్‌బాబు, పురపాలక సంఘ కమిషనర్ వాసుబాబు, ఎంపిడిఒ అనూరాధ తదితరులు పాల్గొన్నారు.

రేషన్ షాపుల పటిష్ఠత
సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా
అవనిగడ్డ, జూలై 13: రాష్ట్రంలోని రేషన్ దుకాణాలను పటిష్టపర్చటమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక గాంధీ క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఎంతో నమ్మకంగా సీఎం చంద్రబాబు తనకు అప్పగించారని, ఇప్పటికే ఆరు జిల్లాల పర్యటన చేయటం ద్వారా నిరుపేదలను ఆదుకునేందుకు తాను చర్యలు చేపడుతున్నానన్నారు. నాణ్యమైన సరుకుల సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలో అన్ని రేషన్ దుకాణాల్లో నాణ్యమైన కిలో ఉప్పు, పావుకిలో కారం కూడా సరఫరా చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో రాగులు సరఫరా చేస్తామన్నారు. తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భాలలో ఏమైనా లోపాలు ఉంటే తక్షణమే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎండీ సూర్యకుమారి మాట్లాడుతూ త్వరలో అవనిగడ్డలో చంద్రన్న మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి ఎంతో చురుగ్గా వ్యవహరించే వ్యక్తి అని మూడు సార్లు శాసనసభ్యుడుగా ఎంన్నికయ్యారని, ఎంతో అనుభవంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖను పటిష్టం చేయగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బండి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా
జోగి రమేష్ హామీ
బంటుమిల్లి, జూలై 13: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో తనవంతు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక సీఐటీయు కార్యాలయంలో బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి రాగానే కార్మికులకు కాలనీలు నిర్మించి వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. తనవంతు సహాయంగా కార్మికుల సంక్షేమానికి రూ.10వేలు అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రచార కార్యదర్శి మలిశెట్టి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.