కృష్ణ

వందల కోట్లు వదులుకుని ప్రజాసేవకు వచ్చా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వనం-మనం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
నూజివీడు, జూలై 14: చింతలపూడి ఎత్తిపోతల పథకంతో మెట్ట ప్రాంతంలోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములు సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీనికి సంబంధించిన పనులు శరవేగంతో జరుగుతున్నాయన్నారు. వచ్చే వ్యవసాయ సీజను నాటికి దీని ద్వారా మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు అందిస్తామని చెప్పారు. శనివారం స్థానిక ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో వనం-మనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరువూరు, మైలవరం, నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలకు సాగునీటి సౌకర్యం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతుల బాధలను అర్ధం చేసుకుని వారి సమస్యల పరిష్కరించేందుకు చింతలపూడి ఎత్తిపోతల ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే గోదావరి, కృష్ణానదులను అనుసంధానం చేసి లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తున్నామన్నారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని సూచించారు. భవనాలు ఇవ్వని ఆనందాన్ని చెట్లు ఇస్తాయని ఇదే ప్రకృతి రహస్యమని అన్నారు. చెట్టు బతకాలంటే నీరు కావాలని అందుకే నీరు-మీరు కార్యక్రమాన్ని చేపట్టి చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించామని చెప్పారు. ఇళ్ళలో చెట్లు ఉండటం కాదని, చెట్ల మధ్యలో ఇళ్ళు నిర్మించుకోవాలని, అదేవిధంగా చెట్ల మధ్యలో గ్రామాలు ఉండాలని, రాష్ట్రం అంతా చెట్ల మధ్యలో ఉంటే రాష్ట్రం సుందరవనంగా ఉంటుందన్నారు. విద్యార్ధులు తరగతి గదులకే పరిమితం కాకుండా చెట్ల మధ్య ఉండి చదువుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పారు. సమైక్యాంధ్రలో సాంకేతిక రంగ అభివృద్ధికి శ్రీకారం చుట్టి బిఎస్‌ఎన్‌ఎల్, విఎస్‌ఎన్‌ఎల్‌డీ రెగ్యులరైజ్ చేయమని సూచించానని, దీంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక నిపుణులు అయిదుగురు ఉంటే వారిలో నలుగురు భారతదేశానికి చెందిన వారని, ఒకరు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాదు రావాలని కోరుకుని సాధించామని, మైక్రోసాఫ్ట్ సీఇఓ తెలుగువారు కావటం మనకు గర్వకారణమని అన్నారు. విద్యుత్ రంగంలో ప్రకృతి పరంగా వస్తున్న సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని, దీని ద్వారా విద్యుత్ చార్జీలు ఎట్టి పరిస్ధితుల్లో పెంచే ప్రసక్తే లేదని సిఎం స్పష్టం చేశారు. విరివిగా విద్యుత్ వాహనాల వినియోగం అందుబాటులోకి వస్తే వాయు కాలుష్యం కూడా తగ్గుతుందని, ఈ దిశలో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ వన-మనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అనంతరం ప్రభుత్వం చెట్ల పెంపకంలో శ్రద్ద చూపి అత్యంతగా గ్రీనరీని అభివృద్ధి చేసిన సంస్ధలు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంస్ధల ప్రతినిధులకు అవార్డులను అందజేశారు. విశాఖ నౌకాశ్రయాన్ని సుందరంగా తీర్చిదిద్దిన కృష్ణబాబుతో పాటు పలువురిని చంద్రబాబు సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, రవీంద్ర, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

లోక్ ఆదాలత్‌తో సత్వర పరిష్కార చర్యలు
* జాతీయ లోక్ ఆదాలత్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు
మచిలీపట్నం, జూలై 14: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ ఆదాలత్‌లు ఎంతగానో దోహదం చేస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు అన్నారు. శనివారం జిల్లా న్యాయస్థానం ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి లక్ష్మణరావు మాట్లాడుతూ లోక్ ఆదాలత్‌ల నిర్వహణతో సత్ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో దీర్ఘకాలిక పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ ఆదాలత్‌లు వేదికగా మారుతున్నాయన్నారు. లోక్ ఆదాలత్‌ల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పని చేస్తోందన్నారు. గతంలో నిర్వహించిన లోక్ ఆదాలత్‌లలో కేసుల పరిష్కారంలో జిల్లా ప్రథమ స్థానం సాధిస్తూ వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న లోక్ ఆదాలత్‌లను కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్, వివిధ న్యాయస్థానాలకు చెందిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శనివారం నిర్వహించిన లోక్ ఆదాలత్‌లో 3100 కేసులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకోగా 2వేల 970 కేసులను పరిష్కరించారు. ఇందులో అత్యధికంగా 1962 క్రిమినల్ కేసులను పరిష్కరించారు. ఎక్సైజ్‌కు సంబంధించి 580 కేసులను పరిష్కరించి రూ.11లక్షల 67వేల 200లు కాంపౌండింగ్ ఫీజును వసూలు చేశారు. 177 సివిల్ కేసులు, 150 చెక్ బౌన్స్, 106 ప్రిలిటిగేషన్ కేసులను పరిష్కరించారు. 101 మోటారు వాహన ప్రమాద క్లైమ్‌లను పరిష్కరించగా రూ.3కోట్లల 19లక్షల 39వేలు క్లైమ్ చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు వచ్చాయి.